అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు షాక్...! ఇక జైల్లోనే..!
వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు(ambati Rambabu)కు వరుస షాకులు తప్పడం లేదు. లడ్డూ కల్తీ నెయ్యి వివాదంలో సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై పోలీసులు 36 కేసులు నమోదు చేయగా.. ఆయన హైకోర్టు వరకూ వెళ్లి వాటిలో ఊరట పొందారు. ఆ లోపే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిరసనల సందర్భంగా నమోదు చేసిన కేసును తెరపైకి తెచ్చి కోర్టు ద్వారా రిమాండ్ కు పంపారు. ఆ కేసు లోనూ బెయిల్ పొందడంతో ఇక జైలు నుంచి విడుదలవుతారని భావించగా.. అలా జరగలేదు.
సత్తెనపల్లిలో 2023లో సంక్రాంతి సందర్భంగా లక్కీడ్రా నిర్వహించి ప్రజల్ని మోసం చేశారంటూ జనసేన నాయకులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసిన కేసులో ఆయనకు ఇవాళ మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఇప్పటివరకూ ఆయన్ను అరెస్టు చేయని పోలీసులు.. ఇప్పుడు మిగతా కేసుల్లో జైలు నుంచి విడుదలయ్యే సమయంలో సడన్ గా దాన్ని తెరపైకి తెచ్చారు. ఈ మేరకు గుంటూరు కోర్టులో అంబటిని ప్రవేశపెట్టి 14 రోజుల రిమాండ్ కు పంపారు.

గతంలో వైసీపీ అధికారంలో ఉండగా. జనసేన నాయకులు చేసిన ఈ ఫిర్యాదును అప్పట్లో పోలీసులు తీసుకోలేదు. దీంతో వారు కోర్టును ఆశ్రయించి పోలీసులు కేసు నమోదు చేసేలా ఆదేశాలు తెచ్చుకున్నారు. దీంతో పోలీసులు తప్పనిసరి పరిస్ధితుల్లో కేసు నమోదు చేసినా చర్యలు మాత్రం తీసుకోలేదు. కానీ ఇప్పుడు హడావిడిగా అంబటి రాంబాబును జైల్లో నుంచి విడుదల చేయకుండా లోపలే ఉంచేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మిగతా కేసుల్లో విముక్తి దొరకడంతో జైలు నుంచి విడుదల అవుదామన్న అంబటికి వరుస షాక్ లు తప్పలేదు.












Click it and Unblock the Notifications