Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విజయ సాయిరెడ్డి కూతురికి హైకోర్టు మరో షాక్-అదీ వదలొద్దని ఆదేశం..!

వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఇచ్చిన ఓ ఆదేశం అమల్లో భాగంగా తాజాగా ఆమెకు హైకోర్టు మరో షాకిచ్చింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి విశాఖలో నిర్మించుకున్న ఓ కట్టడం అక్రమమని తేల్చిన హైకోర్టు...దాన్ని కూల్చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అంతటితో ఆగకుండా ఇదే అంశంలో ఆమెకు మరో షాకిస్తూ తాజాగా జీవీఎంసీకి ఆదేశాలు జారీ చేసింది.

విశాఖ బీచ్ రోడ్డులో సీఆర్ఈజడ్ నిబంధనలు ఉల్లంఘించి నేహారెడ్డి నిర్మించిన ఓ కాంక్రీట్ కట్టడాన్ని జీవీఎంసీ పట్టించుకోవడం లేదని గతంలో జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించన హైకోర్టు.. దాన్ని కూల్చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో జీవీఎంసీ అధికారులు ఆ కట్టడాన్ని తాజాగా కూల్చేశారు. అయితే దీనిపై తదుపరి విచారణలో హైకోర్టు ఆ కూల్చివేతకు అయిన ఖర్చు కూడా నేహారెడ్డి నుంచే వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో హైకోర్టు ఆదేశాలు ఆమెకు మరో షాకిచ్చినట్లయింది.

another setback to ysrcp mp vijayasai reddy s daughter neha in high court

నేహారెడ్డి అక్రమ నిర్మాణంపై హైకోర్టులో జరిగిన విచారణలో ప్రభుత్వ న్యాయవాది ఆమెకు షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు ధర్మాసనం.. ఆ నిర్మాణం కూల్చివేతతో పాటు అందుకు అయిన ఖర్చు కూడా ఆమె నుంచి వసూలు చేయాలని, ఆ వివరాలు కూడా కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో గతంలో ఇదే నిర్మాణాన్ని చూసీ చూడనట్లు వదిలేసి, ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో కూల్చిన జీవీఎంసీ అధికారులు అందుకు తామే ఖర్చుపెట్టారా లేక ఆ ఖర్చును నేహారెడ్డి నుంచి వసూలు చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+