లోకేష్ కు మళ్లీ షాకిచ్చిన పోలీసులు-ఈసారి బంగారుపాళ్యంలో బహిరంగసభకు బ్రేక్ !

ఏపీలో వైసీపీ ప్రభుత్వం జీవో నంబర్ 1 అమలుపై హైకోర్టు తుది తీర్పు ఇవ్వకున్నా పోలీసులు మాత్రం ఇవాళ పూతలపట్టు నియోజకవర్గంలో నారా లోకేష్ బహిరంగసభ నిర్వహించకుండా అడ్డుకున్నారు.

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యానికి యాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా బంగారుపాళ్యం జంక్షన్లో బహిరంగసభ నిర్వహణకు టీడీపీ సిద్ధమైంది. అయితే పోలీసులు దీన్ని చివరి నిమిషంలో అడ్డుకున్నారు.

బంగారుపాళ్యంలో నారా లోకేష్ బహిరంగసభ నిర్వహణకు టీడీపీ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అయితే పోలీసులు చివరి నిమిషంలో బహిరంగసభ నిర్వహించరాదని అడ్డుకున్నారు. దీంతో బంగారుపాళ్యంలో టెన్షన్ టెన్షన్ నెలకొంది. కాసేపట్లో బంగారుపాళ్యంలో నారా లోకేష్ బహిరంగ సభ ప్రారంభం అవ్వాల్సి ఉండగా.. అంతలోనే
భారీగా చేరుకున్న పోలీసులు.. సభ నిర్వహించకుండా అడ్డుకున్నట్లు టీడీపీ ఆరోపించింది.

another shocker to nara lokesh as police stop holding public meeting at bangarupalyam

బంగారుపాళ్యంలో రోడ్డు మీద సమావేశం నిర్వహించడానికి అనుమతి లేదంటూ నారా లోకేష్ ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు వారితో చర్చించినా ప్రయోజనం లేకపోవడంతో లోకేష్.. పక్కనే ఉన్న భవనం ఎక్కి ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే అధికారం మీకు ఎవరు ఇచ్చారంటూ పోలీసుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిన్న కూడా పలమనేరులో బహిరంగ సభ అయిపోగానే లోకేష్ ప్రచార రథాన్ని కాసేపు ఆపేసిన పోలీసులు.. ఆ తర్వాత వదిలిపెట్టారు. ఇవాళ కూడా లోకేష్ ప్రచార రధాన్ని ఆపేందుకు పోలీసులు రావడంతో టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. జీవో నంబర్ 1 అమల్లో లేకపోయినా పోలీసులు దాన్ని సాకుగా చూపి లోకేష్ ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+