Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పయ్యావులకు మరో సక్సెస్- ఇది నిజమే కానీ- పరోక్షంగా అంగీకరించిన జగన్ సర్కార్

ఏపీలో ఖజానా వ్యవహారాలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న పీఏసీ ఛైర్మన్, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మరో విషయంలో సక్సెస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కార్పోరేషన్ (ఏపీఎస్డీసీ) తీసుకున్న రుణాల విషయంలో తాము ఎలాంటి గ్యారంటీలు ఇవ్వలేదని వాదిస్తూ వచ్చిన ప్రభుత్వం..తాజాగా కొన్ని షరతులకు అంగీకరించినట్లు వెల్లడించడంతో ఈ వ్యవహారంలో పయ్యావుల చేసిన ఆరోపణలు నిజమేనని తేలిపోయాయి. దీంతో ప్రభుత్వం తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

ఏపీఎస్డీసీ రుణాల వివాదం

ఏపీఎస్డీసీ రుణాల వివాదం

ఏపీ రాష్ట్ర అభివృద్ధి కార్పోరేషన్ (ఏపీఎస్డీసీ)కి రూ.25 వేల కోట్ల రుణాలు ఇప్పించేందుకు వైసీపీ సర్కార్ చేసిన ప్రయత్నం వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున సేకరిస్తున్న రుణంపై వివరాలను అసెంబ్లీ ద్వారా ప్రజలకు వెల్లడించాల్సి ఉన్నా ప్రభుత్వం మాత్రం బయటపెట్టలేదు. దీంతో ఈ రుణానికి ఇచ్చిన గ్యారంటీలు, అంగీకరించిన షరతులు వివాదాస్పదం అయ్యాయి. అటు కేంద్రం, ఆర్బీఐకి కూడా తెలియకుండా ప్రభుత్వం ఈ రుణం తీసుకుంటోందంటూ పీఏసీ ఛైర్మన్ హోదాలో పయ్యావుల కేశవ్ చేసిన ఆరోపణలతో ఈ వ్యవహారం మరింత సీరియస్ గా మారిపోయింది.

 పయ్యావుల ఆరోపణలివే

పయ్యావుల ఆరోపణలివే

ఏపీఎస్డీసీకి ప్రభుత్వం ఇప్పించిన రూ.25 వేల కోట్ల రుణానికి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని అసెంబ్లీకి ఎందుకు చెప్పలేదని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల ప్రశ్నించారు. అలాగే ఈ ఒప్పందంలో ప్రభుత్వం బ్యాంకులు విధించిన దారుణమైన షరతులకు ఎందుకు అంగీకరించారని ప్రశ్నించారు. దీంతో పాటు మద్యనిషేధం అమలు చేస్తున్న ప్రభుత్వం వచ్చే 20 ఏళ్ల పాటు మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని రుణాలు తీర్చడానికి హామీగా ఎలా పెడుతుందని అడిగారు. వీటిపై ప్రభుత్వం సమాధానం ఇచ్చింది.

 పరోక్షంగా అంగీకరించిన బుగ్గన

పరోక్షంగా అంగీకరించిన బుగ్గన

పయ్యావుల కేశవ్ అడిగిన ప్రశ్నల్లో కొన్నింటికి మాత్రమే ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమాధానం ఇచ్చారు. అమ్మఒడి, ఆసరా, చేయూత పథకాల కోసమే అప్పు తీసుకున్నామన్నారు. ఇచ్చిన జీవోల ప్రకారమే రిుణాలు తీసుకున్నామని తెలిపారు. గుట్టుగా ఏమీ రుణాలు తీసుకోలేదన్నారు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని అప్పులు తీర్చడానికి కేటాయించామన్నారు. మద్యంపై పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ అప్పులు తీరుస్తున్నామని అంగీకరించారు. అప్పు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తద్వారా అప్పులూ నిజమే.. వాటికోసం మద్యం ఆదాయాన్ని కేటాయించడం నిజమేనని అంగీకరించారు.

Recommended Video

    Andhra Pradesh : TDP MLA Payyavula Keshav Slams YSRCP Ruling | Oneindia Telugu
     పయ్యావులకు మరో సక్సెస్

    పయ్యావులకు మరో సక్సెస్

    పీఏసీ ఛైర్మన్ గా పయ్యావుల చేసిన ఆరోపణల్ని ప్రభుత్వం పరోక్షంగానైనా అంగీకరించడం ఆయనకు సక్సెస్ గా చెప్పవచ్చు.ఏపీఎస్డీసీకి ప్రభుత్వం ఇప్పిస్తున్న రుణాల్ని నేరుగా తమకే ఇవ్వాలని, ఈ షరతుల్ని బయటపెట్టరాదని బ్యాంకులకు ప్రభుత్వం విధించిన ఒప్పంద నిబంధనలపై మాత్రం బుగ్గన క్లారిటీ ఇవ్వలేదు. తద్వారా అవన్నీ నిజమేనని ఆయన పరోక్షంగా అంగీకరించినట్లయింది. వీటన్నింటికీ మించి ప్రభుత్వం అసెంబ్లీకి చెప్పకుండా ఇంత భారీ రుణానికి గ్యారంటీగా ఉండటం, షరతులకు అంగీకరించడం వంటి అంశాలకు సర్కార్ నుంచి ఇంకా సమాధానం రాలేదు. దీంతో ఈ వ్యవహారాన్ని కేంద్రం, ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్లేందుకు పయ్యావుల ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+