జగన్‌కు షాక్: టీడీపీలోకి ఇద్దరు కీలక నేతలు? రాజేశ్వరి తర్వాత జిల్లాలో వీరి మాటేమిటి?

Posted By:
Subscribe to Oneindia Telugu

రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాప్రతినిధులు మొత్తం ఖాళీ అయ్యే అవకాశముందా? అంటే అవుననే ప్రచారం సాగుతోంది. రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి శనివారం హఠాత్తుగా టీడీపీలో చేరారు.

జగన్ పాదయాత్ర: వైసిపికి ఝలక్ ఇచ్చిన స్పీకర్ కోడెల

నెహ్రూ, సుబ్బారావులు

నెహ్రూ, సుబ్బారావులు

అంతకుముందే, వైసిపి నుంచి గెలిచిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావులు టీడీపీలో చేరారు. ఇప్పుడు రాజేశ్వరి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014లో వైసిపి నుంచి మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. ఇప్పుడు ముగ్గురు పార్టీ మారారు.

ఆ ఇద్దరి పరిస్థితి ఏమిటి

ఆ ఇద్దరి పరిస్థితి ఏమిటి


ఇక వైసీపీకి తుని, కొత్తకోట నుంచి గెలిచిన దాడిశెట్టి రాజా, చిర్ల జగ్గిరెడ్డిలు ఉన్నారు. వీరు కూడా పార్టీలో ఉంటారా, వెళ్లుతారా అనే చర్చ స్థానికంగా జరుగుతోంది. నెహ్రూ, సుబ్బారావులు టీడీపీలో చేరినప్పుడే రాజేశ్వరి పేరు వినిపించింది. కానీ చాన్నాళ్లకు ఆమె టీడీపీలో చేరారు.

రాజేశ్వరి చెప్పా పెట్టకుండా టీడీపీలోకి

రాజేశ్వరి చెప్పా పెట్టకుండా టీడీపీలోకి

ఇప్పుడు అయితే ఆమె వైసీపీని వీడుతున్నట్లు కనీసం ప్రకటించకుండా హఠాత్తుగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇది వైసీపీని ఆశ్చర్యానికి గురి చేసింది. వైసీపీకీ చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతారని టీడీపీ నేతలు చెబుతున్నారు. వచ్చే వారం పది రోజుల్లో ఒకరిద్దరు టీడీపీలోకి వస్తారని చెబుతున్నారు.

ఇంకా ఎవరు చేరుతారు?

ఇంకా ఎవరు చేరుతారు?

ఈ నేపథ్యంలో మిగిలిన నలభై మందికి పైగా ఎమ్మెల్యేల్లో ఎవరు టీడీపీలో చేరుతారనే చర్చ సాగుతోంది. డిసెంబర్, జనవరి నెలల్లో వైసీపీలో కీలకంగా ఉన్న ఇద్దరు టీడీపీలో చేరే అవకాశముందనే ప్రచారం సాగుతోంది. ఇద్దరిలో ఒకరు టీడీపీ అధిష్టానంతో మాట్లాడుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఆ ఇద్దరు ఎవరు, ఏమిటనే విషయమై టీడీపీ గోప్యంగా ఉంచుతోందని తెలుస్తోంది. ఖరారు అయితే తప్ప వెల్లడి చేయరని సమాచారం. అలాగే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు.. జగన్ వెంటే ఉంటారా, వారు కూడా పార్టీ మారుతారా అనే చర్చ సాగుతోంది.

వీరిద్దరుకి నో ఛాన్స్

వీరిద్దరుకి నో ఛాన్స్

దాడిశెట్టి రాజా టీడీపీలో చేరే అవకాశముందని గుసగుసలు వినిపిస్తున్నాయని, అయితే మంత్రి యనమల రామకృష్ణుడిని కాదని తనకు టిక్కెట్ ఇవ్వరన్న కోణంలో ఆయన ఆ ఆలోచన చేయడం లేదని అంటున్నారు. మరోవైపు చిర్ల జగ్గిరెడ్డి తాను కచ్చితంగా వైసీపీలోనే కొనసాగుతానని తన అనుచరులకు చెబుతున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that Another two YSR Congress Party MLAs may join Telugu Desam after Rampachodavaram MLA Rajeswari.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి