జగన్‌కు ఇక వరుస షాకులే! 'కొడాలి నాని వాడుకొని వదిలేద్దామని చెప్పారు'

అమరావతి: 2019లో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయమని మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, కొల్లు రవీంద్రలు వ్యాఖ్యానించారు. వైసీపీ నేత, ఎమ్మెల్యే కొడాలి నానికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.

బుధవారం వైసీపీ నాయకుడు, గుడివాడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రవికాంత్ టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. రవికాంత్ కూడా నానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నుంచి పలు జిల్లాల్లో వరుసగా టీడీపీలో చేరుతున్న విషయం తెలిసిందే.

వాడుకొని వదిలేద్దామని నాతో చెప్పాడు

వాడుకొని వదిలేద్దామని నాతో చెప్పాడు

టీడీపీలో చేరిన సందర్భంగా రవికాంత్ మాట్లాడారు. నమ్మిన వ్యక్తిని మోసం చేసే నైజం వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిది అన్నారు. యలవర్తి మీద దాడి చేయమని నాని చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితులు అంటే ఆయనకు చులకన భావం అన్నారు. వాడుకొని వదిలేద్దా అని చాలాసార్లు తనతో చెప్పాడని మండిపడ్డారు.

వైసీపీ నుంచి టీడీపీలోకి మరింతమంది

వైసీపీ నుంచి టీడీపీలోకి మరింతమంది

మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, కొల్లు రవీంద్రలు మాట్లాడుతూ.. 2019లో గుడివాడలో టిడిపి గెలుపు ఖాయమని చెప్పారు. కృష్ణా జిల్లాల్లోని 16 నియోజకవర్గాల్లో పసుపు జెండా ఎగురుతుందని చెప్పారు. టిడిపిలోకి మరింతమంది కౌన్సెలర్లు వస్తారని వెల్లడించారు. జగన్‌కు ఇక వరుస షాకులే అని అభిప్రాయపడ్డారు.

 నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు

నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు

ఎమ్మెల్యే కొడాలి నానికి నోరు ఉంది కదా అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని మంత్రులు హెచ్చరించారు. టీడీపీ చేసే అభివృద్ధి కార్యక్రమాల పట్ల రవికాంత్ ఆకర్షితుడయ్యాడని వారు వెల్లడించారు

టిడిపిలోకి వరుస చేరికలు

టిడిపిలోకి వరుస చేరికలు

కాగా, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 22 మంది ఎమ్మెల్యేలు సహా పలువురు ప్రజాప్రతినిధిలు, కిందిస్థాయి నాయకులు వైసీపీ నుంచి అధికార పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వైసీపీలోని కీలక నాయకులకు టీడీపీ గాలం వేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+