కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌తో విసిగిపోయా, అన్ని చెప్తా: గిడ్డి సంచలనం, విజయసాయికి షాక్, ఆగ్రహానికి కారణాలివే!

వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పార్టీ మారుతారనే ప్రచారం నేపథ్యంలో ఆమె పార్టీ కార్యాలయానికి ఆదివారం పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలి వచ్చారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

YSRCP MLA Giddi Eswari Joining TDP Today | Oneindia Telugu

అమరావతి/విశాఖపట్నం: వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పార్టీ మారుతారనే ప్రచారం నేపథ్యంలో ఆమె పార్టీ కార్యాలయానికి ఆదివారం పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలి వచ్చారు. వీరందరితో కలిసి సోమవారం ఈశ్వరి అమరావతి రానున్నారు.

చదవండి: జగన్‌ని కలవనివ్వట్లేదు, సాయి వల్లే: గిడ్డి తర్వాత మరో ఇద్దరు, చక్రం తిప్పిన జవహర్

రెండు రోజులుగా గూడెంకొత్తవీధి, చింతపల్లి, కొయ్యూరు మండలాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులతో భేటీ అయ్యారు. పార్టీ మారే విషయమై అందరి నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. మరోవైపు, వైసీపీ ఆమెను బుజ్జగించేందుకు రంగంలోకి దిగింది.

చదవండి: పార్టీ మారి తప్పుచేశాం: నేతల ముందే టీడీపీపై ఆనం ఘాటు వ్యాఖ్యలు, అసహనం?

గిడ్డి ఈశ్వరిని బుజ్జగించేందుకు రంగంలోకి విజయసాయి

గిడ్డి ఈశ్వరిని బుజ్జగించేందుకు రంగంలోకి విజయసాయి

రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి, కరణం ధర్మశ్రీ తదితరులు గిడ్డి ఈశ్వరిని పార్టీలో ఉండేలా ఒప్పించే ప్రయత్నాలు చేశారు. కానీ అప్పటికే ఆమె మాత్రం ససేమిరా అన్నట్లుగా తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలను వాహనాల్లో విజయవాడ తరలించనున్నారు. రేపు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరనున్నారు.

జగన్‌తో విసిగిపోయా, రేపు అన్నీ చెబుతా

జగన్‌తో విసిగిపోయా, రేపు అన్నీ చెబుతా

ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా ఆదివారం సాయంత్రం పాడేరు నుంచి విజయవాడకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. జగన్ వైఖరితో విసిగిపోయానని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం విజయవాడలో అన్ని విషయాలు వెల్లడిస్తానని తెలిపారు. తాను విజయవాడ బయలుదేరుతున్నట్లు చెప్పారు.

అంతకుమించి మాటలకు నో

అంతకుమించి మాటలకు నో

జగన్‌తో విసిగిపోయానని చెప్పడం తప్ప ఆమె ఇంకా ఏమీ మాట్లాడేందుకు ఇష్టపడలేదు. తన తీవ్ర అసంతృప్తిని ఆ ఒక్క మాటలోనే ఆమె వెల్లడించారు. గిడ్డి ఈశ్వరి సోమవారం ఏం చెబుతారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

నాలుగు నెలలుగా అసంతృప్తి, ఆ బాధ కారణం

నాలుగు నెలలుగా అసంతృప్తి, ఆ బాధ కారణం

గిడ్డి ఈశ్వరి విశాఖ ఏజన్సీలో కీలక నాయకురాలు. ఆమె గత నాలుగు నెలలుగా వైసీపీ అగ్రనేతల తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. వైసీపీ నేతలతో విభేదాలు తీవ్రమవడంతో ఆమె పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా వైసీపీలో తన మాట చెల్లుబాటు కావడం లేదనే బాధ ఈశ్వరి పార్టీ మారడానికి కారణంగా కనిపిస్తోంది.

నాకు తెలియకుండా ఏజెన్సీలో ఎలా నియమిస్తారని ప్రశ్న

నాకు తెలియకుండా ఏజెన్సీలో ఎలా నియమిస్తారని ప్రశ్న

ఈశ్వరి పార్టీ మారడానికి ప్రధాన కారణం అరకు వైసీపీ ఇంఛార్జ్ ఎంపికే ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఈశ్వరి అరకు వైసీపీ ఇంఛార్జ్‌గా ఓ పేరును ప్రతిపాధించగా వైసీపీ అధిష్టానం కుంభా రవిబాబును ఇంఛార్జ్‌గా నియమించారు. దీనిని ఈశ్వరి జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి ఆమె అసంతృప్తితో ఉన్నారు. తనకు తెలియకుండా ఏజన్సీ ఏరియాలో మీరెలా నియమిస్తారని ఆమె వైసీపీ నేతలను ప్రశ్నించారు.

గిడ్డి ఈశ్వరికి తెలియకుండానే విజయసాయి కీలక నిర్ణయాలు

గిడ్డి ఈశ్వరికి తెలియకుండానే విజయసాయి కీలక నిర్ణయాలు

ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి వైసీపీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఆమెకు తెలియకుండానే ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే అరకు ఇంఛార్జ్ ఎంపిక జరిగింది. దీనిపై ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేసినా అధిష్టానం పట్టించుకోలేదు. దీంతో ఆమె మరింత ఆవేదనకు గురయ్యారు.

ఆమె అసంతృప్తికి కారణాలు

ఆమె అసంతృప్తికి కారణాలు

వైసీపీ తీరుపై ఈశ్వరి అసంతృప్తితో ఉన్న విషయం గుర్తించిన టీడీపీ నేతలు దానిని అనుకూలంగా మలుచుకున్నారు. ఆమెతో గత రెండేళ్లుగా వీరు చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఆ అవకాశాన్ని వారు వదులుకోలేదు. అసంతృప్తితో ఉన్న ఈశ్వరితో ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నేతలు సంప్రదింపులు జరిపారు. మంత్రి జవహర్, టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు చొరవతో ఆమె పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నారు. పార్టీ పరంగా నిరాదరణకు గురికావడం పార్టీలో తన మాట చెల్లుబాటు కాకపోవడం, నియోజకవర్గంలో అభివృద్ధి జరగకపోవడం ఇవన్నీ వైసీపీ పట్ల ఆమెలో అసంతృప్తిని పెంచాయి.

చదవండి: ఇవాంకా హైదరాబాద్ పర్యటన కథనాలు

English summary
YSRCP MLA from Paderu, Giddi Eswari wil ljoin the ruling TDP. She will joining on Monday in the presence of CM Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X