పార్టీ మారి తప్పుచేశాం: నేతల ముందే టీడీపీపై ఆనం ఘాటు వ్యాఖ్యలు, అసహనం?
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం సోదరులు టీడీపీల చేరిన కొద్ది రోజుల తర్వాత నుంచి వారు అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారని, విమర్శలు చేస్తున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి.
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం సోదరులు టీడీపీల చేరిన కొద్ది రోజుల తర్వాత నుంచి వారు అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారని, విమర్శలు చేస్తున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి.
చదవండి: బాబుకు మరో షాక్, ఆ పదవి కోసం పట్టు: జగన్ వైపు ఆనం బ్రదర్స్?

టీడీపీ అధిష్టానంపై ఆనం వివేకా మరోసారి
తాజాగా ఆనం వివేకానంద రెడ్డి మరోసారి టీడీపీపై ఘాటు వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. తమకు పార్టీలో ప్రాధాన్యం లేకుండా పోయిందని, టీడీపీ నేతల ఎదుటే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది.

పార్టీ నేతల వద్దే
ఆనం వివేకా ఇంటికి మంత్రి అమర్నాథ్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిలు వెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ అధిష్టానంపై ఆనం వివేకానంద ఘాటు విమర్శలు చేసిందని అంటున్నారు. పార్టీలో తమ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది.

నమ్మించి మోసం చేశారని వ్యాఖ్య
తమను నమ్మించి మోసం చేశారని ఆనం ఘాటు వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. జిల్లాలో కూడా నిర్వహిస్తున్న కార్యక్రమాల విషయంలో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని, తమకు పదవులు ముఖ్యం కాదని, అనేక పదవులు అనుభవించామని వ్యాఖ్యానించారు.

కనీస గౌరవం ఇవ్వడం లేదు
కానీ తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆనం వివేకా అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. తాము పార్టీ మారి పెద్ద తప్పు చేశామని టీడీపీ నేతల ముందే వాపోయారట. ఆయన వ్యాఖ్యలతో నేతలు అవాక్కయ్యారని అంటున్నారు.

పలుమార్లు ఆనం అసంతృప్తి
ఆనం సోదరులు దాదాపు రెండేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. పార్టీలో చేరే సమయంలో తమకు ఇచ్చిన హామీని అధిష్టానం అమలు చేయడం లేదని ఆనం వివేకా పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

వైసీపీలో చేరనున్నట్లు నాడు ప్రచారం
తమకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పారని, కానీ ఇవ్వలేదని ఆనం గతంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనను మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుజ్జగించారు. అంతేకాదు, టిడిపిపై అసంతృప్తితో ఉన్న ఆనం వివేకా వైసీపీలో చేరనున్నారని కూడా ప్రచారం సాగింది.

గతంలోను సంచలన వ్యాఖ్యలు
కొద్ది రోజుల క్రితం కూడా అధిష్టానంపై ఆనం వివేకా సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడంతో నాడు అలిగారు.

టీడీపీలో చేరి తప్పుచేశామని
ఈ సందర్భంగా ఆనం తన మనసులోని భావాలను అనుచరుల వద్ద వ్యక్తం చేస్తున్నారు. 'టీడీపీలో చేరి తప్పు చేశాం బ్రదర్.. ఒకరకంగా మోసపోయాం. ఎన్ని అవమానాలను భరిస్తాం..? రాజకీయాల్లో ఎప్పుడూ ఇలా జరగలేదు.. ఎవరెవరికో పదవులు ఇస్తున్నారం'టూ ఆయన వేదాంత ధోరణిలో తన సన్నిహితుల వద్ద వాపోతున్నారు.
-
ఆ విషయంలో ఎవరిమాట వినొద్దు అని కలెక్టర్ లకు సీఎం చంద్రబాబు ఆదేశం! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!!












Click it and Unblock the Notifications