అక్రమంగా కోట్లు సంపాదించాడు: ఏసీబీ వలలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్

Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)వలలో మరో పెద్ద అవినీతి చేప పడింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో విశాఖ అర్బన్‌ ల్యాండ్‌ సీలిండ్‌ ప్రత్యేక అధికారి కార్యాలయంలో డిప్యూటీ సర్వే ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ముమ్మన రాజేశ్వరరావు, ఆయన బంధువుల ఇళ్లపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.

ఇప్పటివరకు దాదాపు రూ.15కోట్ల ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. విశాఖ మురళీనగర్‌లోని అయ్యప్పనగర్‌ ప్రాంతంలోని ఆయన నివాసంలో ఏసీబీ కేంద్ర బృందం అధికారు డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో ఉదయం 7.30 గంటల నుంచి సోదాలు జరుగుతున్నాయి. మొత్తం ఆరు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Anti-Corruption Bureau raids properties of Visakhapatnam deputy inspector of survey and urban land ceilings

ఆన్‌లైన్‌ మోసం: నగదు మాయం

ఆన్‌లైన్‌లో నగదు మాయమైనట్లు వచ్చిన ఫిర్యాదుతో పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ లక్ష్మణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. మధురవాడ స్వతంత్రనగర్‌కాలనీకి చెందిన జి.రామారావుకు యాక్సిస్‌ బ్యాంకులో ఖాతా ఉంది.

బుధవారం ఆయన చరవాణికి ఒక వ్యక్తి ఫోన్‌ చేసి.. తాను బ్యాంకు నుంచి మాట్లాడుతున్నానని చెప్పారు. 'మీ ఏటీఎం బ్లాక్‌ అయింది... పిన్‌ సంఖ్య చెబితే కొత్త కార్డు పంపుతాం' అని ఆ వ్యక్తి అడగ్గా.. రామారావు ఆ వివరాలు చెప్పారు. తెల్లవారేసరికి ఖాతా నుంచి సుమారు రూ.29వేల నగదు ఆన్‌లైన్‌ కొనుగోలు చేసినట్లు బాధితుని ఫోన్‌కి సమాచారం వచ్చింది. మోసపోయినట్లు గుర్తించిన రామారావు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sleuths of Anti-Corruption Bureau (ACB) on Thursday morning raided properties and houses of Urban Land Ceiling deputy inspector (Survey) M Rajeswara Rao at Ayyappa Nagar colony, on charges of amassing assets disproportionate to his known sources of income.
Please Wait while comments are loading...