శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ గ్రామంపైకి చీమలు యుద్ధం: ఏం చేయాలో తోచని స్థితిలో ప్రజలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: సాధారణంగా పల్లెటూర్ల మీద పడి కోతులు దాడులు చేస్తున్నాయనో లేదంటే కుక్కలు మా గ్రామంలో బాగా పెరిగియంటూ వచ్చే ఫిర్యాదుల గురించి అందరం వింటూనే ఉంటాం. కానీ శ్రీకాకుళం జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం చీమల బెడద ఉందంట.

చీమల బెడద ఏంటని అనుకుంటున్నారా? నిజమే ఆ గ్రామంలో వందలు కాదు, లక్షల సంఖ్యలో చీమలు ఆ గ్రామంలో నిత్యం దాడి చేస్తున్నాయంట. బయట నాలుగడుగులు వేస్తే ఓ చీమ కుడుతుందని, ఇళ్లల్లోని అన్ని ఆహార పదార్థాలనూ తినేస్తున్నాయని, ఈ చీమల దెబ్బతో తమకు వింత రోగాలు వస్తున్నాయని ఆ గ్రామ ప్రజలు గ్రీవెన్స్ సెల్ కు వచ్చి వాపోయారు.

Ants problem in a village srikakulam district at andhra pradesh

ఇంతకీ ఈ సమస్య వచ్చిన ఊరు ఎక్కడుందంటే శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని గులివిందల పేట. ఈ గ్రామానికి వచ్చిన అధికారులు సైతం అక్కడున్న చీమల దండుని విస్తుతపోయారంట. గ్రామ ప్రజల మేరకు ఫిర్యాదునైతే స్వీకరించారుగానీ, వాటిని ఎలా తరిమికొట్టాలన్నది మాత్రం తెలియడం లేదు.

ఇది ఇలా ఉంటే ప్రపంచంలో చీమలపై శాస్త్రవేత్తలు నిర్వహించిన సర్వే ప్రకారం చీమలన్నింటిని పంచితే ఒక్కో మనిషికి పది లక్షలు చీమల వంతున వస్తాయని అంచనా.

English summary
Ants problem in a village srikakulam district at andhra pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X