10th Exams In AP వాయిదా ? జూన్‌ 7 కష్టమే- సర్కారుకు అధికారుల ప్రతిపాదనలివే

ఏపీలో పదో తరగతి పరీక్షలను ఎలాగైనా నిర్వహించి తీరాలని ప్రభుత్వం పట్టుదలగా ఉన్నా క్షేత్రస్ధాయిలో మాత్రం పరిస్దితులు అందుకు అనుకూలంగా కనిపించడం లేదు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పరీక్షల నిర్వహణ డోలాయమానంలో పడుతోంది. జూన్‌ 7న పరీక్షలు ప్రారంభం కానుండగా..ఏర్పాట్లకు తగినంత సమయం లేకపోవడం సమస్యగా మారింది.

ఏపీలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఇప్పటి నుంచ కనీసం నెల రోజుల సమయం కావాలని విద్యాశాఖ ప్రభుత్వాన్ని కోరుతోంది. కానీ జూన్‌ 7 నుంచి పరీక్షలు జరగాల్సిందేనని ప్రభుత్వం పట్టుబడుతోంది. దీంతో విద్యాశాఖ అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. అయినా తగినంత సమయం లేనందున పరీక్షల వాయిదాయే మేలనే ప్రతిపాదనను విద్యాశాఖ అధికారులు ప్రభుత్వం ముందు ఉంచినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం సమీక్షించి తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.

ap 10th class examinations may postpone, officials seek one month time for arrangements

పదో తరగతి పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వం పట్టుదలగా ఉండగా.. విపక్షాలతో పాటు విద్యార్ధుల తల్లితండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్‌ ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో పరీక్షల నిర్వహణతో సమస్యలు తప్పవని అంతా భావిస్తున్నారు. కానీ విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహించి తీరుతామని ప్రభుత్వం చెబుతోంది. దీంతో పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది.

ప్రస్తుత పరిస్ధితుల దృష్ట్యా చూస్తే పరీక్షలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్‌ చివరి నాటికి కరోనా ప్రభావం తగ్గుతుందన అంచనా వేస్తున్న నేపథ్యంలో వాయిదా దిశగా ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+