AP SSC results 2023 : పదో తరగతి ఫెయిలైన విద్యార్ధులకు SSC బోర్డు కీలక సూచన...

ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల వెల్లడి సందర్భంగా ప్రభుత్వ తరఫున విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కీలక ప్రకటన చేశారు. ఫలితాల విడుదల తర్వాత ఉత్తీర్ణులు కాని విద్యార్ధులను ఉద్దేశించి ఈ ప్రకటన చేశారు. ఇందులో ఆయన వారికి పలు సూచనలు చేశారు.

పరీక్షల్లో ఫెయిలైన విద్యార్ధులకు ప్రభుత్వం తరఫున ప్రవీణ్ ప్రకాష్ ఈసారి కీలక సూచన చేశారు. ఈసారి ఉత్తీర్ణులు కాని విద్యార్ధులు తొందరపడి ఎలాంటి అవాంఛనీయ చర్యలు తీసుకోవద్దని సూచించారు. వారి కోసం తాము ప్రత్యేకంగా తరగతులు నిర్వహించడంతో పాటు పలు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అలాగే వీరి కోసం నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన వివరాలను కూడా మంత్రి బొత్స ప్రకటించారు.

 botsa

తాజాగా ఇంటర్ పరీక్ష ఫలితాల విడుదల తర్వాత ఏపీలో పలువురు ఫెయిలైన విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఫలితాల విడుదల సందర్భంగా పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్ధులకు ఎస్సెస్సీ బోర్డు ఈ సూచనలు చేసినట్లు తెలుస్తోంది. పరీక్షల్లో ఉత్తీర్ణులు కాకపోవడం అనేది సమస్య కాదని, వారికి మరెన్నో అవకాశాలు ఉంటాయని ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. అలాగే మంత్రి బొత్స కూడా దీనిపై విద్యార్ధులు ఎలా వ్యవహరించాలనే దానిపై సూచనలు చేశారు.

 botsa

పరీక్షలు తప్పిన 27.74 శాతం విద్యార్ధుల కోసం జూన్ 2 నుంచి 10 వరకూ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. మే 17 తేదీలోగా సప్లిమెంటరీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అలాగే మే 27వ తేదీ వరకూ లేట్ ఫీజుతో కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈసారి పదో తరగతి పరీక్ష తప్పిన వారికి ప్రత్యేక తరగతులు కూడా నిర్వహిస్తున్నట్లు బొత్స వెల్లడించారు.

https://www.bse.ap.gov.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+