బ్లాక్ మనీ కింగ్‌గా హెడ్ మాస్టర్: కోట్లాది విలువ చేసే ఆస్తులు..
నెల్లూరు: దాదాపు మూడు కోట్ల రూపాయల మేరకు అక్రమాస్తులు కలిగిన ఓ హెడ్మాస్టరు అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులకు పట్టుబడ్డాడు. తమకు నెల్లూరు నగరంలోని మూలాపేట బ్రాహ్మణవీధిలో నివాసం ఉంటున్న బూదం సురేష్ అక్రమ ఆస్తి కలిగి ఉన్నాడని సమాచారం అందిందని ఎసిబి అధికారులు చెప్పారు.
తమకు అందిన సమాచారంతో ఎసిబి అధికారులకు గురువారం ఆయన ఆస్తులపై సోదాలు చేపట్టారు. ఏకకాలంలో నగరంలోని ఆయన ఇంటిపై నాయుడుపేట, పొదిలి కనపర్తిపాడు, గొలగమూడి, చెముడుగుంట ప్రాంతాల్లో ఉన్న ఆస్తులపై దాడులు చేశారు.

ఈ దాడుల్లో ఆరు ప్లాట్లు మూలాపేటలో మూడు అంతస్తుల భవనం, నాలుగు వందల గ్రాముల బంగారం కొన్ని పత్రాలను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత కొంత కాలం నుండి సురేష్‌పై ఏసిబి అధికారులు నిఘాపెట్టి గురువారం ఆయన ఆస్తులపై దాడులు నిర్వహించారు.
కోటి రూపాయల మేరకు విలువ చేసే ఆస్తులకు సురేష్ బినామీగా ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. అతను వడ్డీ వ్యాపారిగా మారి పెద్ద యెత్తున ఆస్తులను కూడబెట్టాడని కూడా ఎసిబి అధికారులు తెలుసుుకన్నారు. దాడుల్లో ఏసిబి ఇన్‌స్పెక్టర్ తోట ప్రభాకర్, సిఐ శివకుమార్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications