చలో విజయవాడ: 3 నెలల్లో పూర్తి స్థాయిలో పాలన అని పరకాల
విజయవాడ: వచ్చే మూడు నెలల్లో మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ నుంచే పూర్తి స్థాయి పాలన కొనసాగనుందని ఎపి మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. మంగళవారం ఆయన విజయవాడలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, కార్యదర్శులు, కమిషనర్లు వారానికి నాలుగు రోజులు విజయవాడలో ఉంటారని, విజయవాడకు మొత్తం అధికార యంత్రాంగం అంతా తరలించాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారని చెప్పారు.
పరిశ్రమలకు భూమి, విద్యుత్, నీటి కేటాయింపుపై కొత్త విధానంతోపాటు మొదటి త్రైమాసికంలో రెవెన్యూ లోటు.. రెండో త్రైమాసికంలో లోటు భర్తీపై సీఎం చర్చించారని, ఆదాయం తెచ్చే శాఖలు, సేవలందించే శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారని ఆయన వివరించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం విజయవాడ నుంచి పాలన ప్రారంభించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా అక్కడే ఉన్నారు. ఆర్థిక వ్యవస్థపై చంద్రబాబు అధికారులు సమీక్ష నిర్వహించారు.
ముందుగా ఆర్థికశాఖపై సమావేశం నిర్వహించిన చంద్రబాబు నాయుడు సాయంత్రం గ్రామీణాభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తారు. వారం రోజుల పాటు ఆయన బెజవాడలోనే ఉంటారు. విజయవాడ కలెక్టర్ క్యాంప్ కార్యాలయాన్ని చీఫ్ సెక్రటరీ కార్యాలయంగా మార్పు చేస్తూ జీవో జారీ చేశారు.












Click it and Unblock the Notifications