ఏపీలో కరోనా: పేకాటలో టీడీపీ ఎమ్మెల్సీ.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు
ఓవైపు అధినేత చంద్రబాబు.. జగన్ సర్కారుపై పోరాడుతోంటే.. టీడీపీ నేతలు మాత్రం ఫుల్లుగా టైమ్‌పాస్‌లో మునిగిపోయారు. సీఎం సొంత జిల్లా కడపలో ఆదివారం పోలీసులు పలు చోట్ల దాడులు చేయగా.. టీడీపీ ఎమ్మెల్సీ దేవగుడి శివనాథ్‌రెడ్డి పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయారు. గతంలో విజయవాడలో పేకాట ఆడిన ఓ వ్యక్తి ద్వారా 24 మందికి కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో సామూహిక ఆటలు వద్దని పోలీసులు ఆదేశించడం తెలిసిందే. ఆదివారం నాటికి రాష్ట్రంలో కేసుల సంఖ్య 2230కి పెరగడంతో జనం కదలికలపై నిఘా పెంచారు. ఈక్రమంలోనే టీడీపీ ఎమ్మెల్సీ పట్టుపడ్డారు.
కడప జిల్లా జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో ఆదివారం పోలీసులు సోదాలు చేపట్టారు. మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.15,700 స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో టీడీపీ ఎమ్మెల్సీ శివనాథ్ రెడ్డి కూడా ఉన్నారని పోలీస్ అధికారులు తెలిపారు.

దేవగుడితోపాటు అలాగే మరో రెండు చోట్ల కూడా సోదాలు చేశామని, ఒక చోట ఐదుగురిని, మరో చోట ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని, వారి దగ్గర్నుంచి రూ. 3500, రూ.5000 చొప్పున స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్సీ పేకాట ఆడుతూ దొరికిపోయిన వైనం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గిట్టనివాళ్లే ఆయనపై ఫిర్యాదు చేసి ఉండొచ్చని అనుచరులు అనుమానిస్తున్నారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!












Click it and Unblock the Notifications