తెలుగు రాష్ట్రాల్లో కొత్త కరోనా కేసులు - ప్రభుత్వం తాజా అలర్ట్స్..!!

మరో సారి కరోనా కలకలంమొదలైంది. దేశంలో కొత్త కరోనా వెలుగులోకి రావటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త కేసులు బయట పడుతున్నాయి. దీంతో, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. అధికారులకు దిశా నిర్దేశం చేసాయి. ఏపీ సీఎం జగన్ అధికారులతో సమీక్ష చేసారు. ముందస్తు చర్యలకు యంత్రాంగం సిద్దమైంది.

తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాల రాజమండ్రిలో తొలి కోవిడ్ కేసు నమోదైంది. 85 ఏళ్ల మహిళకు కోవిడ్ సోకినట్లు తెలుస్తోంది. శాంపిల్ ను జీనోమ్ సీక్వెన్స్ ల్యాబ్ కు అధికారులు పంపించారు. ఏలూరులో మరో కరోనా కేసు నమోదైంది. కొత్త వేరియంట్ నేపథ్యంలో ర్యాండమ్ చేసిన వైద్యులు ఓ ప్రయివేటు మెడికల్ కాలేజ్ వైద్యుడికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించారు. వేరియంట్ నిర్ధారణ కోసం శ్వాబ్ ను హైదరాబాద్ లోని జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ కు పంపారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి వేరే రాష్ట్రాలకు ఎక్కడకు వెళ్లి రాలేదని అధికారులు వెల్లడించారు.

AP and Telangana Govts alerts on new covid Cases, issues latest guide lines for officials

ఇటు హైదరాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారులు కరోనా బారిన పడ్డారు. నాలుగైదు రోజులుగా తీవ్రమైన జర్వం, ఊపిరి పీల్చుకోవటంలో చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు.14 నెలల చిన్నారికి కరోనా సోకింది, ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 19 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వ్యాప్తితో ఎంజీఎం సిబ్బంది అప్రమత్తయ్యారు. మాస్క్ లేనిదే ఆసుపత్రిలోకి అనుమతించటం లేదు. కోవిడ్ పేషంట్లకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తెలంగాణలో కొత్గా 6 కరోనా కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 2 కేసులు నమోదయ్యాయి, 16 కేసులు హైదరాబాద్ లోనే నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో సోషల్ డిస్టన్స్, మాస్క్ వినియోగం పైన నిఫుణలు సూచనలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+