ఆడపిల్లలపై అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ గా ఏపీ.. దున్నపోతు ప్రభుత్వంలో చలనం ఏది ? లోకేష్ ధ్వజం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లలపై జరుగుతున్న దారుణాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆడపిల్లలపై అరాచకాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిందని లోకేష్ విమర్శలు గుప్పించారు. గుంటూరులో మూర్ఖుడి దాడికి మొన్న రమ్య నేలకొరిగిందని పేర్కొన్న లోకేష్ నిన్న గుంటూరు జిల్లా రాజుపాలెంలో చిన్నారి, ఓ మానవ మృగం చేతిలో అఘాయిత్యానికి గురైందని నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అభం శుభం తెలియని చిన్నారి పశువాంఛకు బలైంది అని నారా లోకేష్ పేర్కొన్నారు.

జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్కరికీ భద్రత లేదు
ఇదే సమయంలో నేడు విజయనగరం జిల్లా చౌడువాడలో ఉన్మాది పెట్రోల్ పోసి యువతిని తగులబెట్టారని, మూడు రోజుల్లో ఆడపిల్లలపై మూడు అమానవీయ ఘటనలు చోటుచేసుకున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్. నిత్యం ఇలాంటి దారుణాలు జరుగుతున్నా దున్నపోతు ప్రభుత్వంలో స్పందన లేదని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్కరికీ భద్రత లేదని ప్రజలు భయంభయంగా బతుకుతున్నారని నారా లోకేష్ దుయ్యబట్టారు.

AP as a care of address to anarchy on girls .. Lokesh fires on jagan govt

ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తే రోజుకు ఒకరు ఇలా మృగాళ్లలాగా ప్రవర్తిస్తారా ?
మీ ఇంట్లో మహిళలకు రక్షణ లేదని, సొంత చెల్లెళ్లకి న్యాయం చేయలేక పోయారని ఎద్దేవా చేశారు. మీ ఇంటి పక్క నివసించేవారు అత్యాచారానికి గురయ్యారు అని పేర్కొన్నారు. అయినా జగన్ నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నారని మండిపడ్డారు. ఇక దిశా చట్టం పేరుతో, రక్షించ లేని దిశా యాప్ పేరుతో ప్రచారం చేసుకోకండి, పబ్లిసిటీయే సిగ్గుపడుతుంది అంటూ నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిందితులను పట్టుకొని శిక్షించడంలో ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తే రోజుకు ఒకరు ఇలా మృగాళ్ల లాగా ప్రవర్తిస్తారా అంటూ నారా లోకేష్ ప్రశ్నించారు.

చిన్నారుల ఉసురు తగిలితే వైసీపీకి, ఈ రాష్ట్రానికి మంచిది కాదు
బాధితులను బాధపెడుతూ, నిందితులను రక్షించే ప్రభుత్వమని స్పష్టంగా అర్థమవుతుందని, అందుకే క్రిమినల్స్ ఇంతగా చెలరేగి పోతున్నారని లోకేష్ పేర్కొన్నారు. దయచేసి ఈ దారుణాలపై ఇప్పటికైనా దృష్టిసారించాలని పేర్కొన్న లోకేష్ చిన్నారుల ఉసురు తగిలితే వైసీపీకి, ఈ రాష్ట్రానికి మంచిది కాదంటూ విమర్శించారు. ఇక జగన్ రెడ్డి పాలనలో ఏదైనా ఘటన జరిగితే వారం రోజుల్లో పోలీసు దర్యాప్తు చేస్తారని పద్నాలుగు రోజుల్లోపు న్యాయ ప్రక్రియ పూర్తి చేసి, 21 రోజుల్లో దోషులకు ఉరిశిక్ష అన్నారు కదా.. మీ రెండు ఏళ్ళ పాలనలో 500 మంది ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరిగాయి. ఈరోజు వరకు ఏ ఒక్కరికి కూడా శిక్ష పడింది లేదు అంటూ విమర్శించారు లోకేష్ .

నిందితుడిని కఠినంగా శిక్షించాలన్న లోకేష్
ఇప్పటికైనా కబుర్లతో కాలక్షేపం ఆపి రమ్య కిరాతకంగా నడిరోడ్డుపై హతమార్చిన నిందితుడిని శిక్షించండి అంటూ లోకేష్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. గత కొద్ది రోజులుగా లోకేష్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాధిత కుటుంబాలను పరామర్శించటంతో పాటు, వారి కుటుంబాలకు అండగా ఉంటానని, ప్రభుత్వంపై న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానని లోకేష్ తేల్చి చెబుతున్నారు. రమ్య కుటుంబానికి న్యాయం జరిగే వరకు జగన్ సర్కార్ ను వదిలేది లేదని వైసీపీ ప్రభుత్వానికి డెడ్లైన్ విధించిన లోకేష్ నిత్యం రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న దారుణాలపై సీఎం జగన్ ను ప్రశ్నించారు. న్యాయం కావాలని నినదిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+