'బాపు'కు అసెంబ్లీ సంతాపం, కొత్త రాజధానిలో కళాక్షేత్రం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభ బాపు మృతికి సోమవారం సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా బాలకృష్ణ శ్రీరామరాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. బాపు - రమణల పేరిట ప్రపంచస్థాయి కళాక్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలో ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పారు. కార్టూనిస్టుగా, దర్శకుడిగా బాపు అంచెలంచెలుగా ఎదిగారన్నారు.
చిత్రకారుడిగా ఖండాంతరాలకు తెలుగు ఖ్యాతిని ఇనుమడింప చేశారన్నారు. కృష్ణుడు, రాముడి వంటి పురాణ పురుషుల పాత్రలను బాపు తీర్చిదిద్దారన్నారు. తెలుగు అక్షరాన్నితేజోవంతం చేశారన్నారు. భీముడు, శివుడి వంటి ఇతిహాస పాత్రలను అద్భుతంగా చిత్రీకరించారన్నారు. హిందూపురాణ పాత్రలను తన చిత్రలేఖనం ద్వారా చూపించారన్నారు. సీతమ్మను సుగుణాల రాశి, తెలుగింటి తల్లిగా చేసింది బాపూనే అన్నారు.
ముత్యాల ముగ్గు చిత్రం ఓ కళాఖండమన్నారు. అక్కినేనికి ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టింది బాపు చిత్రాలే అన్నారు. బాపుకు రాని అవార్డు లేదన్నారు. పద్మశ్రీ, రఘుపతివెంకయ్య అవార్డులు వచ్చాయన్నారు. తిరుపతి అకాడమీ ఆఫ్ ఫైనార్ట్స్ కూడా అవార్డును ఇచ్చిందన్నారు.

బాపు మృతి తీరని లోటు అన్నారు. బాపు - రమణల పేరిట ఏపీలో మ్యూజియం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో బాపు - రమణల సహకారంతో పాఠ్యపుస్తకాలు వచ్చాయన్నారు. విజయవాడలోని కోస్టల్ మ్యూజియానికి బాపు పేరు పెడతామన్నారు.
మహా మనిషి: జగన్
మరణం లేని మహా మనిషి బాపు అని జగన్ అన్నారు. తెలుగు వారు ఎప్పుడు గుర్తుంచుకనే వ్యక్తి అన్నారు. తెలుగు జాతి ఓ ఆణిముత్యాన్ని కోల్పోయిందన్నారు. బాపు మరణం బాధాకరమన్నారు. బాపు గారి గీత, రాత తెలుగువారి జీవితాల్లో భాగమన్నారు.
రాజమండ్రి కేంద్రంగా అనేక సినిమాలు: గోరంట్ల
తెలుగువారి గొప్పతనాన్ని బాపు ప్రపంచానికి చాటి చెప్పారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమండ్రి కేంద్రంగా బాపు అనేక చిత్రాలు తీశారన్నారు. తెలుగువాడి పౌరుషాన్ని, భావావేషాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి బాపు అన్నారు. బాపు మరణం తెలుగు భాషకు, నుడికారానికి తీరని లోటు అన్నారు.
-
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications