ఏపీ అసెంబ్లీ సమావేశాలు షూరు.. జగన్ వచ్చేనా..?

శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. దీనిలో భాగంగానే నవంబర్ 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే నవంబర్‌ 6న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్‌ 12న అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశముంటుందని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. వారం పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెల్లడి కానుంది.

కూటమి ప్రభుత్వం కొలువు దీరి నాలుగు నెలలు పూర్తైంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేదు. గత అసెంబ్లీ సమావేశాల్లో తాత్కలిక బడ్జెట్‌తో సరిపెట్టాల్సి వచ్చింది.పాత బడ్జెట్‌నే కొనసాగించారు. శీతాకాల సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే యోచనలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. దీంతో పాటు పలు సంక్షేమ పథకాలకు సంబంధించిన కొన్ని జీవోలకు అసెంబ్లీ ఆమోదం తెలుపనుంది. ఇదిలా ఉంటే శీతాకాల సమావేశాలకు మాజీ సీఎం ,వైసీపీ అధినేత జగన్ హాజరవుతారా లేదా అన్నది తేలియాల్సి ఉంది.

AP assembly meetings on November 12

గత ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమిని చవిచూసింది. ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించి, ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. దీంతో జగన్ కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం తర్వాత జగన్ అసెంబ్లీకి మళ్లీ హాజరుకాలేదు. స్పీకర్ అయన్నపాత్రుడు జగన్‌ను అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని పలుమార్లు విజ్క్షప్తి చేశారు.అయినప్పటికీ ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. మరి ఇప్పుడు జరగనున్న శీతాకాల సమావేశాలకైన ఆయన వెళ్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+