18 నుంచి ఏపి అసెంబ్లీ సమావేశాలు: కోడెల, హైదరాబాద్‌లోనే..
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. డిసెంబర్ 18 నుంచి 24 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వెల్లడించారు. ఆయన సోమవారం ఇక్కడ మాట్లాడారు.
అసెంబ్లీ సమావేశాలను నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించాలని తొలుత భావించామని.. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్‌లోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సభా సమయాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి అధికార, ప్రతిపక్షాలు వినియోగించుకోవాలని స్పీకర్ కోడెల సూచించారు.

అందరూ కష్టపడితే న్యవాంధ్రను స్వర్ణాంధ్రగా మార్చవచ్చన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం ఎంతో అవసరమని, తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నిర్మించుకోవాలని సూచించారు.
5న ఏపి మంత్రివర్గ సమావేశం
డిసెంబర్ 5న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. అదే విధంగా డిసెంబర్ 9న సింగపూర్ పరిశ్రమల మంత్రి ఈశ్వరన్, ఇతర ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వారికి రాజధాని నమూనా అందజేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications