వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్సార్ మరణం, కరోనా విలయం -సీఎం జగన్ భావోద్వేగం -కొవిడ్ మృతులకు అసెంబ్లీ నివాళి -రూ.1000 కోట్లు

|
Google Oneindia TeluguNews

కరోనా విలయం మిగిల్చిన విషాదాన్ని, ఆత్మీయులను కోల్పోయి ఆయా కుటుంబాలు అనుభవించే క్షోభను, కొవిడ్ పరిస్థితుల వల్ల తలెత్తే నైరశ్యాన్ని అర్థం చేసుకోగలనని, ప్రాణం విలువ తనకు బాగా తెలుసని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ప్రాణం విలువ తెలసుకాబట్టే వాటిని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నానని, విలయకాలంలో ప్రతి ఒక్కరికీ భరోసాగా ఉంటున్నానని తెలిపారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కరోనా పరిస్థితులపై గురువారం సభలో మాట్లాడిన సీఎం జగన్.. తన తండ్రి దివంగత వైఎస్సార్ ను తలుచుకూంటూ భావోద్వేగానికి లోనయ్యారు..

రఘురామపై జగన్ సర్కారు సంచలనం -ఆ హక్కుంది కానీ, రక్తపాతం తలెత్తితే? -సుప్రీంలో కౌంటర్, ఇంకొద్ది గంటల్లోరఘురామపై జగన్ సర్కారు సంచలనం -ఆ హక్కుంది కానీ, రక్తపాతం తలెత్తితే? -సుప్రీంలో కౌంటర్, ఇంకొద్ది గంటల్లో

ప్రాణం విలువ.. వైఎస్సార్ మృతి..

ప్రాణం విలువ.. వైఎస్సార్ మృతి..


''మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా, ఓదార్పుయాత్ర చేసి ప్రతి కుటుంబాన్ని పరామర్శించాను. నాకు ప్రాణం విలువ బాగా తెలుసు. అందుకే వైఎస్సార్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీలో ఇప్పుడు విప్లవాత్మక మార్పులు చేశాం. గడిచిన రెండేళ్లలో ప్రతి ఒక్కరినీ దృష్టిలో పెట్టుుని అడుగులు వేశాం. కరోనా విలయంలో ఆరోగ్యశ్రీని మరింత సమర్థవంతంగా మెరుగుపర్చాం. గ్రామాల్లో వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు నిర్మిస్తున్నాం. ప్రతి 2 వేల మంది జనాభాకు ఒక ఏఎన్‌ఎంను నియమించాం. ఫోన్‌ చేసిన 20 నిమిషాల్లో అంబులెన్స్‌ వచ్చేలా మార్పులు చేశాం..'' అని సీఎం జగన్ పేర్కొన్నారు.

జగన్ సంచలనం: రాజధాని అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం -అసెంబ్లీ భేటీకి ముందే కరకట్ట రోడ్డుకు శంకుస్థాపనజగన్ సంచలనం: రాజధాని అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం -అసెంబ్లీ భేటీకి ముందే కరకట్ట రోడ్డుకు శంకుస్థాపన

కొవిడ్ మృతులకు అసెంబ్లీ సంతాపం

కొవిడ్ మృతులకు అసెంబ్లీ సంతాపం


కోవిడ్‌ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి ఏపీ అసెంబ్లీ నివాళి అర్పించింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ కొవిడ్ నిర్వహణ కోసం వైసీపీ సర్కారు చేపట్టిన పనుల్ని గుర్తుచేశారు. ఒకేసారి 1180 అంబులెన్స్‌లను ప్రారంభించడం మొదలు, ఏపీలో నిత్యం లక్షల కొద్దీ శాంపిళ్లను పరీక్షిస్తున్నామని, నాడు- నేడు కార్యక్రమంతో ఆస్పత్రుల రూపురేఖలు మార్చామని, ఏడాది కాలంలోనే ఏపీలో 150కి పైగా ల్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చామని, కరోనా తొలి వేవ్ లో 261 ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తే.. సెకండ్‌ వేవ్‌లో 649 ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తున్నామని, ఇతర రాష్ట్రాల్లో చికిత్స చేయించుకునేవారికి కూడా ఆరోగ్య శ్రీ అందిస్తున్నామని, కొవిడ్‌ నియంత్రణకు ఇప్పటికే రూ. 2,229 కోట్లు ఖర్చు చేశామని, తాజాగా బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సను కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చామని సీఎం జగన్ గుర్తుచేశారు. కాగా,

కరోనాపై పోరుకు బడ్జెట్‌లో భారీగా..

కరోనాపై పోరుకు బడ్జెట్‌లో భారీగా..

ఏపీలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్ ఇవ్వడానికి ముందు, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఏపీ బడ్జెట్ 2021-22లో కోవిడ్‌ కట్టడిపై కీలక అంశాలను చేర్చారు. కరోనా మహమ్మారిపై పోరు కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రత్యేకంగా రూ.1000 కేటాయించినట్లు బుగ్గన ప్రకటించారు. బడ్జెట్ లో ఆరోగ్య రంగానికి మొత్తం రూ.13,840.44 కోట్ల కేటాయించగా, వాటిలో ఆరోగ్యశ్రీ, మందుల కొనుగోలుకు రూ.2,248.94 కోట్లు, ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమానికి రూ.1535 కోట్లు, కోవిడ్‌పై పోరాటానికి రూ.1000 కోట్లు, ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో శానిటేషన్‌కు రూ.100 కోట్లు, శ్రీకాకుళం జిల్లా పలాస ఆస్పత్రికి రూ.50 కోట్లు వెచ్చిస్తున్నట్లు ఆర్థిక మంత్రి వివరించారు.

English summary
amid Budget session, andhra pradesh assembly on thursday pays tribute to people who lost their lives due to covid-19. speaking on covid-19 measures, chief minister ys jagan mohan reddy made an emotional speech in assembly. remembering his deceased father ys, jagan said he know the value of human life. the ap govt has allocated Rs.1000 crores for fight against covid in AP Budget 2021-22.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X