అమరావతి కోసం మరో రూ.15 వేల కోట్ల రుణం, కేంద్రం గ్రీన్ సిగ్నల్..!!

అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అమరావతిలో నిర్మాణాలు వేగవంతం చేసింది. ఆర్దికంగా కేంద్రం మద్దతుగా నిలుస్తోంది. కాగా.. అమరావతిలో భవిష్యత్ నిర్మాణాల కోసం అదనపు రుణాలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు కేంద్రంతో చర్చలు చేసింది. కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలపటంతో.. మరో రూ 15 వేల కోట్ల రుణం అమరావతికి సమీకరించనున్నారు.

ఏపీ ప్రభుత్వం అమరావతి కేంద్రంగా వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. అమరావతిలో నిర్మాణా లను 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. రెండో విడత భూ సమీకరణలో భాగంగా పలు గ్రామాల రైతులతో సమావేశాలు నిర్వహిస్తోంది. రైతులు భూ సమీకరణలో భాగంగా భూములు ఇచ్చిన వారికి రిటర్నబుల్ ప్లాట్ల ను అందిస్తోంది. రైతులకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదే సమయంలో అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ -- ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అదనంగా మరో 1.6 బిలియన్ డాలర్ల రుణం సమీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రంతో జరిగిన చర్చల ఫలితంగా అదనపు రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో, అదనపు రుణం కోసం ప్రపంచ బ్యాంక్ - ఏడీబీకి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేయనుంది.

TTD: ఇక కొండ కిందే పార్కింగ్..వసతి - విశాఖ, విజయవాడల్లో దర్శన టోకెన్లు..!!
TTD: ఇక కొండ కిందే పార్కింగ్..వసతి - విశాఖ, విజయవాడల్లో దర్శన టోకెన్లు..!!
world-bank-adb-commit-1-6bn-for-andhra-capital-amaravati-as-state-govr-latest-request-here-the-d

అమరావతి కోసం వరుస నిర్ణయాలు

ఇక, అమరావతిలో వివిధ ప్రాజెక్టులకు ఇప్పటికే 1.6 బిలియన్ డాలర్ల రుణం ఈ రెండు బ్యాంకు లు అందిస్తున్నాయి. దీనికి అదనంగా హడ్కో మరో 11 వేల కోట్ల రూపాయల రుణం ఇస్తోంది. ఇక, అదనపు రుణం మంజూరైతే అందుబాటులోకి మొత్తం 40 వేల కోట్ల రూపాయలు వరకు వస్తాయని లెక్కలు వేస్తున్నారు. ఇక.. మొత్తం 88 వేల కోట్ల రూపాయలతో అమరావతిలో వివిధ పనులకు ప్రణాళిక రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా బద్దంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికి 50 వేల కోట్ల రూపాయల విలువైన పనులకు సీఆర్డీఏ,అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ టెండర్లు పిలిచాయి. ఇక.. ఇప్పుడు ఈ రుణం ద్వారా నిర్మాణాలకు ఎలాంటి ఆర్దిక సమస్యలు రాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+