పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబం కోసం కేసీఆర్ మరో సంచలననిర్ణయం!

ఇటీవల అకస్మాత్తుగా మృతి చెందిన వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే, ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పెద్దదిక్కుగా అధినేత కేసీఆర్ ఉంటానని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి కోసం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి, పార్టీ తరఫున రెండు కోట్ల 25 లక్షల రూపాయలను అందజేయాలని నిర్ణయించారు.

సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో కోటి రూపాయలు

ఇటీవల అనారోగ్యంతో మరణించిన పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ఎప్పటికీ అండగా ఉంటానని చెప్పిన, తండ్రి పాత్ర పోషిస్తానని చెప్పిన బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అండగా నిలవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా, సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు.

kcr support to peddi family BRS chief KCR sensational decision to provide Rs 2 25 cr to the family

పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మకి 25లక్షలు రూపాయలు

అదే సమయంలో, పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మ వృద్ధాప్యంలో ఉన్నందున వారి బాగోగుల కోసం మరో 25 లక్షలు రూపాయలను తల్లి పేరు మీద బ్యాంకులో జమ చేయాలని కెసిఆర్ నిర్ణయించారు. తద్వారా మొత్తంగా, 2 కోట్ల 25 లక్షల రూపాయలను పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి భారత రాష్ట్ర సమితి తరపున ఆర్థిక సహాయాన్ని అందిస్తూ అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నారు.

వరంగల్ జిల్లా పార్టీ సీనియర్ నేతలతో చర్చించి నిర్ణయం

ఇంతటితోనే కాకుండా పిల్లల భవిష్యత్తు, వారి చదువు తదితర కుటుంబ సంక్షేమానికి సంబంధించి పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తుందని అధినేత కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు పార్టీ సీనియర్లతో పాటు వరంగల్ జిల్లా పార్టీ సీనియర్ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణాలో స్మార్ట్ రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ఆదేశాలు!
తెలంగాణాలో స్మార్ట్ రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ఆదేశాలు!

ఎల్లకాలం వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్

పెద్ది సుదర్శన్ రెడ్డి దశదినకర్మల కార్యక్రమాలు ముగిసిన తర్వాత జిల్లా పార్టీ ముఖ్యులు కూర్చొని వారి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారనీ, ఎల్లకాలం వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మీద ఉన్న ప్రేమతో మాజీ సీఎం కేసీఆర్ మళ్ళీ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+