అసలు అలాంటి క్యారెక్టర్ ఎందుకు రాశారు?: పెద్ది మూవీపై నటి షాకింగ్ కామెంట్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ సినిమా 'పెద్ది' మరోసారి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్రపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా థియేటర్లలోకి వచ్చిన సమయం నుంచే ఈ క్యారెక్టర్ చిత్రీకరణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్వగా.. తాజాగా నటి అదితి బాలన్ చేసిన కామెంట్స్ ఈ వివాదాన్ని మళ్లీ చర్చనీయాంశంగా మార్చాయి.

'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్రైలర్ వచ్చేసింది.. సూర్య ఖాతాలో మరో హిట్టు..!
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్రైలర్ వచ్చేసింది.. సూర్య ఖాతాలో మరో హిట్టు..!

నటి అదితి బాలన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'పెద్ది' సినిమాలో హీరోయిన్ పాత్ర డిజైన్ చేసిన తీరును పరోక్షంగా తప్పుబట్టారు. అసలు అలాంటి ప్రాధాన్యం లేని, విమర్శలకు తావిచ్చే పాత్రలను ఎందుకు రాస్తారో అర్థం కావడం లేదని అదితి బాలన్ ఆవేదన వ్యక్తం చేశారు. కథలో హీరోయిన్‌కు సరైన ప్రాముఖ్యత, లోతైన రచన, ఓ బలమైన ఉద్దేశం ఉండాలని ఆమె స్పష్టం చేశారు. అయితే తన విమర్శలు నటి జాన్వీ కపూర్ అభినయంపై కాదని, కేవలం ఆ క్యారెక్టర్ రైటింగ్, దర్శకుడి ఆలోచనా విధానంపైనే అని అదితి బాలన్ స్పష్టం చేయడం గమనార్హం.

Aditi Balan Slams Peddi Movie Character Writing Questions Janhvi Kapoor Role in Cinema Full Details

ఈ సందర్భంగా మాట్లాడిన అదితి బాలన్ మాస్, కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలను కేవలం గ్లామర్‌కే పరిమితం చేయకుండా మరికొంత బాధ్యతాయుతంగా తీర్చిదిద్దవచ్చని అభిప్రాయపడ్డారు. రచయితలు కొద్దిగా శ్రద్ధ వహిస్తే మహిళా పాత్రకు మరింత గౌరవం దక్కుతుందని ఆమె పేర్కొన్నారు.

మహేశ్ బర్త్ డే ట్రీట్ మామూలుగా లేదుగా.. 'వారణాసి' నుంచి ఏకంగా..!
మహేశ్ బర్త్ డే ట్రీట్ మామూలుగా లేదుగా.. 'వారణాసి' నుంచి ఏకంగా..!

స్వయంగా హీరోయిన్‌కు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన కథలను ఎంచుకునే అదితి బాలన్ కామెంట్స్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చకే దారితీశాయి. రూ.వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింటే భారీ కమర్షియల్ సినిమాల్లో మహిళా పాత్రలను కేవలం షోపీస్‌లుగా చూపిస్తున్నారా? వారికి స్టోరీలో నిజమైన ప్రాముఖ్యత లభించడం లేదా? అనే పాత ప్రశ్నకు ఈ ఘటన మళ్లీ ఊపిరి పోసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+