రేపు ఆధారాలతో వస్తా.. సిట్ అధికారులకు బండి భగీరథ్ లెటర్!
తెలంగాణా రాష్ట్రంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరధ్ పోక్సో కేసు సంచలనంగా మారింది. ఈ పోక్సో కేసులో సిట్ విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు ఇచ్చినా, ఆయన హాజరు కాకపోవటం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. యూనియన్ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ సిట్ అధికారులకు లేఖ రాశారు.
ఆధారాలు, డాక్యుమెంట్లతో విచారణకు హాజరు
తాను వ్యక్తిగత కారణాల వల్ల ఈరోజు విచారణకు రాలేకపోతున్నానని, రేపు శుక్రవారం మే 15వ తేదీన అన్ని ముఖ్యమైన ఆధారాలు, డాక్యుమెంట్లతో విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. సిట్ అధికారులు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని నోటీసు ఇచ్చినప్పటికీ భగీరథ్ రాలేదు. దీనిపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన సిట్‌కు లేఖ పంపడం గమనార్హం.

పోక్సో కేసులో సహకరిస్తానని వెల్లడి
బండి భగీరథ్ సిట్ అధికారులకు రాసిన లేఖలో రేపు కీలక ఆధారాలతో విచారణకు హాజరవుతానని ప్రకటన చేశారు. పోక్సో కేసులో పూర్తి సహకరిస్తానని తెలిపారు. ఇదే సమయంలో రేపు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ చేయనున్నారు. భగీరథ్ ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మంగళవారం దాఖలైంది.
కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత విచారణకు
ప్రస్తుతం కోర్టు సెలవులు ఉన్నందున గురువారం వెకేషన్ బెంచ్ ముందు విచారణ జరగనుంది. కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత విచారణకు హాజరు కావాలని భగీరథ్ ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో సిట్ అధికారులు బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రెండోసారి నమోదు చేశారు. అనంతరం కఠినమైన పోక్సో సెక్షన్లను కేసులో చేర్చారు.
బండి భగీరధ్ కేసు విషయంలో భవిష్యత్ లో ఏం జరుగుతుంది
బాధితురాలి వయస్సు మరియు బర్త్ సర్టిఫికెట్ల వివాదం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భగీరథ్ రేపు విచారణ సమయంలో ఏ ఆధారాలు సమర్పిస్తారనేది ఇప్పుడు అందరి ముందు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా తెలంగాణా రాష్ట్రంలో సంచలనంగా మారిన బండి భగీరధ్ కేసు విషయంలో భవిష్యత్ లో ఏం జరుగుతుంది అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications