రాబోయే మూడ్రోజుల పాటు భారీ వర్షాలు- ఈ జిల్లాలకు అలర్ట్..!!
వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఏపీ, తెలంగాణలో వానలు పడతాయని చెప్పింది. వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతం, దానికి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య దిశగా జార్ఖండ్ వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో మేఘావృతమైన వాతావరణంతో పాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
వాతావరణ శాఖ రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో వర్ష సూచన చేసింది. ఏపీ, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. పలు జిల్లాల్లో పిడుగులు కూడా పడే ప్రమాదం పొంచి ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేసింది. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతంలో వానలు పడతాయని అమరావతి వతావరణ కేంద్రం తెలిపింది. అయితే వాయుగుండం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు పడతాయని చెప్పింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ నెల 18వ తేదీ వరకూ ఆంధ్రప్రదేశ్ లో వానలు పడతాయని చెప్పింది.

అప్రమత్తంగా ఉండాలని సూచనలు
ఇదే సమయంలో తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షాల పైన హెచ్చరిక జారీ అయింది. మోస్తరు నుంచి తేలిక పాటి వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. వికారాబాద్, నాగర్ కర్నూల్, నల్లగొండ, మహబూబాబాద్, జనగాం, కరీంనగర్, సిరిసిల్ల, సిద్ధిపేట, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్ రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో తేలిక పాటి వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల పిడుగులు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఎల్ నినో ప్రభావంతో వానలు లేక ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి తాజా అప్డేట్స్ కొంత ఉపశమనంగా మారుతున్నాయి.













Click it and Unblock the Notifications