దంచికొడుతున్న వర్షం, మరో మూడు రోజులు - ఈ జిల్లాలకు తీవ్ర హెచ్చరిక..!!
భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక జిల్లాలకు వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు చేసింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మంతో పాటు పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. మరో మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది.
తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.
తెలంగాణలో పలుచోట్ల ఈ నెల 24, 25, 26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కుమురం భీం ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రెడ్ ఎలర్ట్ జారీ చేసిన జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశించారు.

అధికార యంత్రాంగం అప్రమత్తం
రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మంతోపాటు పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్‌తో పాటు నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశమున్నట్టు పేర్కొన్నారు. ఇక ఈనెల 26న ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే పరిస్థితులున్నాయని అధికారులు అంచనా వేశారు. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వానలు కురువొచ్చని అంచనా వేస్తున్నారు. అటు ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితి అంచనా వేస్తోంది. అధికారులకు కీలక దిశా నిర్దేశం చేస్తోంది.












Click it and Unblock the Notifications
