కూన రవిపై చర్యలకు రంగం సిద్దం - స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలతో : నిమ్మగడ్డ పైనా..!!
టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవిపై చర్యలకు రంగం సిద్దం అయింది. స్పీకర్ తమ్మినేని పైన అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో ఆయన అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యారు. ఇప్పటికే స్పీకర్ పైన చేసిన వ్యాఖ్యలకు కూన రవికి ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. గతంలో ఆయన గైర్హాజరు అయ్యారు. తాజాగా..ఆయన హాజరై కమిటీ ముందు తన వివరణ ఇచ్చారు. అందులో తాను వ్యక్తిగత హోదాలోనే వ్యాఖ్యలు చేశానని...స్పీకర్ స్థానాన్ని అగౌరవపరచలేదని చెప్పినట్లుగా సమాచారం.

కమిటీకి రవి కుమార్ వివరణ
ఆ సమయంలో ప్రివిలేజ్ కమిటీ సభ్యులు స్పీకర్ గా ఉన్న వ్యక్తి పైన వ్యాఖ్యలు చేసి..వాటిని వ్యక్తిగత హోదాలోనే చేసానని ఎలా చెబుతారని ప్రశ్నించారు. దీనికి గతంలో స్పీకర్ తమ్మినేని తాను బయట ఉన్నప్పుడు సభాపతిని కాదంటూ చేసిన వ్యాఖ్యల తో ఉన్న పత్రికా క్లిప్పింగ్ ను చూపించినట్లుగా తెలుస్తోంది. ఈ వాదనలో కమిటీ సభ్యులు ఏకీభవించ లేదు. కూన రవి పైన కఠిన చర్యలకు సిఫార్సు చేయాలని నిర్ణయించారు. అయితే, కూన రవి ప్రస్తుతం శాసనసభలో సభ్యుడిగా లేరు. దీంతో..సభా హక్కుల సంఘం ఆయన పైన చేసే సిఫార్సులు ఏ విధంగా ఉంటాయనేది ఆసక్తి కరంగా మారింది.

సభ్యుడు కాకపోవటంతో .. చర్యలు ఇలా
కానీ, ప్రస్తుతం సభలో సభ్యుడు కాకపోవటంతో..ఆయన్ను జైలుకు పంపటం లాంటి కఠిన చర్యల దిశగా ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కమిటీ తమ సిఫార్సులను స్పీకర్ కు వెల్లడించనుంది. ఇక, ఇదే సమావేశంలో.. గతంలో ఏపీ ఎన్నికల కమిషనర్ గా వ్యవహరించిన నిమ్మగడ్డ రమేష్ పైన వచ్చిన ఫిర్యాదుల పైన చర్చించారు. ఆయన ఎన్నికల కమిషనర్ గా ఉన్న సమయంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. బొత్సా సత్యానారాయణ తమ హక్కులకు భంగం కలిగించారంటూ రమేష్ కుమార్ పైన ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసారు. దీని పైన ప్రివిలేజ్ కమిటీకి ఆయన ఇప్పటికే నోటీసులు సైతం జారీ చేసింది.

నిమ్మగడ్డ పై ఫిర్యాదు విషయంలో
కాగా, ప్రివిలేజ్ కమిటీకి లేఖ రాసిన నిమ్మగడ్డ తన ఉద్దేశం వారి హక్కులకు కలిగించటం కాదంటూ వివరణ ఇచ్చారు. ఆయన పదవీ విరమణ చేసినా..ఆయన పైన వచ్చిన ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీ చర్చించి.. నిర్ణయం తీసుకొనే అధికారం ఉంటుందని అధికార పార్టీ నేతలు స్పష్టం చేస్తన్నారు. ఈ సమావేశంలో దీని పైన చర్చకు వచ్చినా..ఈ నెలాఖరులోగా మరోసారి సమావేశమై పరిష్కరించాలని నిర్ణయించారు. దీంతో..శాసనసభా సమావేశాలు ఈ నెల 25న ముగియనుండటంతో..ఈ లోగానే ప్రివిలేజ్ కమిటీ మరోసారి సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఇక, టీడీపీ నేత కూన రవి పైన కమిటీ ఎలాంటి సిఫార్సులు చేస్తుందనేది ఆసక్తి కరంగా మారింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications