చంద్రబాబు భావోద్వేగం: బిజెపితో జగన్ లింకుపై తీవ్ర వ్యాఖ్యలు, హోదాపై తీర్మానం

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి. ప్రత్యేక హోదా, ఏపీ పునర్విభజన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా మంగళవారం నాడు తీర్మానించింది. ఏపీ పునర్విభజన చట్టం, ప్రత్యేక హోదా అమలు విషయంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏపీ శాసనసభ నిరసన వ్యక్తం చేసింది. కేంద్రం ఇచ్చిన హమీలను నెరవేర్చాలని డిమాండ్ చేసింది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈ తీర్మాణం ప్రవేశపెట్టారు.ఈ విషయమై ప్రసంగించే సమయంలో బాబు బావోద్వేగానికి గురయ్యాడు

విభజన చట్టం అమలులో కేంద్రం నిర్లక్ష్యం చేయడంపై ఏపీ అసెంబ్లీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఏపీ పునర్విభజన చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. మంగళవారం నాడు ఏపీ అసెంబ్లీ కేంద్రం తీరుపై తీర్మాణం చేసింది. ఈ తీర్మాణాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రవేశ పెట్టారు. ప్రత్యేక హోదాను కూడ ఇవ్వాలని అసెంబ్లీ తీర్మాణించింది. ఏపీ పునర్విభజన బిల్లు, రాజ్యసభలో ఇచ్చిన హమీలను అమలు చేయాలని ఏపీ శాసనసభ తీర్మానించింది

ఏపీ ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బావోద్వేగంతో కంటతడి పెట్టుకొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై సుదీర్ఘంగా చంద్రబాబునాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు భావోద్వేగానికి గురయ్యాడు.

ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై బిజెపి శాసనసభపక్ష నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడిన తర్వాత చంద్రబాబునాయుడు మాట్లాడారు. మంగళవారం మధ్యాహ్నం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రసంగించారు. తన ప్రసంగం చివర్లో రాష్ట్రానికి ఇచ్చిన హమీలను నెరవేర్చాలని కేంద్రం తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ తీర్మాణం చేసింది ఏపీ అసెంబ్లీ.

ఏపీ పునర్విభజన చట్టం అమలుకు తీర్మానం

ఏపీ పునర్విభజన చట్టం అమలుకు తీర్మానం

ఏపీ పునర్విభజన చట్టం, ప్రత్యేక హోదా, రాజ్యసభలో ఇచ్చిన హమీలను అమలు చేయాలని కోరుతూ ఏపీ శాసనసభ మంగళవారం నాడు తీర్మాణం చేసింది. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హమీలను అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఏపీ ప్రభుత్వం అభిప్రాయపడింది. ఏపీ పునర్విభజన చట్టంతో పాటు, ప్రత్యేక హోదాను, రాజ్యసభలో ఇచ్చిన హమీలను అమలు చేయాలని డిమాండ్ చేసింది. నాలుగేళ్ళు దాటినా ఏపీకి నిధుల విషయంలో కేంద్రం తీరుపై నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి నిధులను అందించాలని కోరుతూ శాసనసభ తీర్మానించింది.

వాళ్ళెలా ప్రధానిని కలుస్తారు

వాళ్ళెలా ప్రధానిని కలుస్తారు

ఎ1 ఎ2 కూడ ప్రధాన మంత్రిని కలుస్తున్నారు,. వైసీపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతోంది.విశ్వాసం ఉందని చెబుతూనే అవిశ్వాసాం పెడతామని చెబుతోంది. రాష్ట్ర విభజనకు కారణమైన వైసీపీ నేత రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాడని బాబు ఎద్దేవా చేశారు.కేంద్రంపై అవిశ్వాసం పెడుతామంటున్నారు. మమ్మల్ని మద్దతివ్వాలంటున్నారు. ఎంపీలు రాజీనాామాలు చేస్తామంటున్నారు.కేంద్రంపై విశ్వాసం ఉంటే ఎందుకు అవిశ్వాసం పెడుతున్నారని బాబు ప్రశ్నించారు. ప్రజలు మోసపోరు వైసీపీని శాశ్వతంగా శిక్షిస్తారని బాబు అభిప్రాయపడ్డారు.పోలవరాన్ని ప్రాజెక్టును అడ్డుకొనేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందన్నారు.

రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ ను అర్ధం చేసుకోవాలి

రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ ను అర్ధం చేసుకోవాలి

ఏపీ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్‌ను అర్ధం చేసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కేంద్రాన్ని కోరారు. కేంద్రం తీరు చూస్తోంటే ఏం చేయాలో అర్ధం కావడం లేదన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని రెండు పార్టీలు హమీలు ఇచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు ఏపీ ప్రజల సెంటిమెంట్‌ను అర్ధం చేసుకొని ప్రత్యేక హోదాను ఇవ్వాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు.

రాజధాని కడతామంటే విమర్శలు చేశారు

రాజధాని కడతామంటే విమర్శలు చేశారు

ఆంధ్రుల ఆత్మగౌరవం నిలబెట్టేలా రాజధానిని నిర్మించనున్నట్టు ఏపీ చంద్రబాబునాయుడు చెప్పారు. రాజధాని నిర్మాణం విషయంలో కూడ అనేక విమర్శలు చేశారని బాబు గుర్తు చేశారు.హైద్రాబాద్, బెంగుళూరు తదితర నగరాలకు ధీటుగా అమరావతి నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు చంద్రబాబునాయుడు చెప్పారు. రాజధానికి నిర్మాణం విషయంలో బిజెపి నేతలు కూడ విమర్శలు చేశారని ఆయన బిజెపి నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సాంస్కృతిక రాజధానిగా అమరావతి నిర్మాణం కోసం కేంద్రం సహకరించాలన్నారు. కేంద్ర ఆదాయంలో కొంత ఆదాయాన్ని అమరావతి నిర్మాణం కోసం కేటాయించాలని బాబు కోరారు.

అమిత్ షా ఫోన్ చేసేవరకు నాకు తెలియదు

అమిత్ షా ఫోన్ చేసేవరకు నాకు తెలియదు

బీహర్ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతి అభ్యర్ధిగా నిర్ణయించడంపై తనకు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పోన్ చేసే వరకు తెలియదన్నారు. రామ్ నాద్ కోవింద్‌ను అభ్యర్ధిగా నిర్ణయించిన విషయాన్ని తనకు తెలుపగానే మద్దతివ్వనున్నట్టు అమిత్ షా కు చెప్పానన్నారు. కానీ, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తనకు తెలియకముందే రామ్ నాద్ కోవింద్‌ను రాష్ట్రపతి అభ్యర్ధిగా నిర్ణయించారని విజయసాయిరెడ్డికి తెలిసినట్టుగా మీడియాలో వచ్చినట్టుగా బాబు గుర్తు చేశారు. ఏం జరుగుతోందని బాబు ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై బిజెపి నేతలకు లేని నమ్మకం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎలా వచ్చిందో అర్ధం కావడం లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. మాకు నిధులు ఇవ్వాలని కోరాను.కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలనుకొంటే ఇవ్వొచ్చు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ap legislative assembly resolution for implement for special status and bifurcation act. Ap cm chandrababunaidu introduced resolution in Ap Assembly on Tuesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి