బోణీ కొట్టిన టీడీపీ కూటమి: రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తొలి విజయం
AP assembly election Results: రాజమండ్రి రూరల్ నుండి పోటీ చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయన తన సమీప ప్రత్యర్థి వైసిపి ఎమ్మెల్యేగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పైన విజయం సాధించారు. ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతతో దూసుకుపోతున్నారు. ఏపీ వ్యాప్తంగా కూటమి హవా కొనసాగుతోంది.
దాదాపు మెజార్టీ స్థానాల్లో క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేస్తోంది. దీంతో టీడీపీ-జనసేన అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. రాష్ట్రంలో తొలి ఎన్నికల ఫలితం వచ్చింది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి 50 వేల పైచిలుకు ఆధిక్యంతో బోణీ కొట్టారు.

ఏపీలో ఎన్నికల ఫలితాలలో తొలి ఫలితంలో టిడిపి కూటమి విజయం సాధించడం పార్టీ శ్రేణులను సంతోషంలో ముంచేస్తోంది. ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘన విజయం సాధించడంతో సోషల్ మీడియాలో ఆయన పైన సెటైర్లు పేలుతున్నాయి. ఫస్ట్ మంత్రి నీకే ఇవ్వాలంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ని ఉద్దేశించి నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.
తాత తీసావుగా తాట.. ఫస్ట్ మినిస్టర్ మీరే అవ్వాలి. ఓట్ల ఆధిక్యంతో కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఘన విజయం అంటూ పోస్టులు పెడుతున్నారు.తెలుగుదేశం కూటమి తొలి విజయం రాజమండ్రి రూరల్ తో కన్ఫర్మ్ అయిందని చెబుతున్నారు.
రాజమండ్రి రూరల్ నుండి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తన సమీప ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పైన విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు ప్రస్తుతం సంబరాలు జరుపుకుంటున్నాయి.












Click it and Unblock the Notifications