తొలిరోజే స్పీకర్ అయ్యన్న సంచలనాలు..! జగన్ కు షాకులు - ఛానళ్లపై బ్యాన్ లిఫ్ట్..!
ఏపీలో అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన చింతకాయల అయ్యన్నపాత్రుడు తొలిరోజే డ్యూటీ మొదలుపెట్టేశారు. నిన్న స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన్ను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందించారు. వైసీపీ ఇవాళ సభకు రాకపోవడంతో మిగతా సభ్యులు మాత్రమే కొత్త స్పీకర్ అయన్నపై మాట్లాడారు.
అనంతరం కొత్త స్పీకర్ అయ్యన్నపాత్రుడు తొలిరోజే సంచలన నిర్ణయంపై తొలి సంతకం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో మూడు ఛానళ్లపై విధించిన నిషేధాన్ని ఎత్తేసే ఫైలుపై సంతకం చేశారు. అనంతరం మీడియాతో మాడ్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ పదవి రావడం సంతోషంగా ఉందని అయ్యన్న తెలిపారు. సీనియారిటీ ఉంది కాబట్టే చంద్రబాబు స్పీకర్ పదవి ఇచ్చారన్నారు. సభను హుందాతనంగా గౌరవంగా నడపడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. ఎన్టీఆర్ హయాంలో తాను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు తమకు ట్రైనింగ్ ఇచ్చారని గుర్తుచేసుకున్నారు.

ఈసారి అసెంబ్లీలో 88 మంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారని, వారికి వారికి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. సభలో ప్రవేశపెట్టే బడ్జెట్, క్వశ్చన్ అవర్, జీరో వన్ వంటి విషయాల పైన అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
గతంలో సభను ఏ విధంగా నడిపారో చూశామన్నారు. మాజీ సీఎం జగన్ పై స్పందిస్తూ.. జగన్ ప్రతిపక్ష నేతకాదని, ప్రతిపక్ష హోదా ఆయనకు లేదని తేల్చిచెప్పేశారు. సాధారణ సభ్యులకు కేటాయించిన సమయాన్ని మాత్రమే ఆయనకూ ఇస్తామన్నారు.

అలాగే తన గురించి జగన్ మాట్లాడిన మాటలు, దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు.
ఆయన గురించి తన దగ్గర ప్రస్తావన తేవద్దని తేల్చిచెప్పేశారు. గతంలో మీడియా మీద ఆంక్షలు పెట్టి అడ్డుకున్నారని, ఇప్పుడు మీడియా మీద ఆంక్షలు ఎత్తివేస్తూ తొలి సంతకం పెట్టానని తెలిపారు. వాళ్లు చేశారు కదా అని తాము మీడియా మీద ఆంక్షలు పెట్టబోమన్నారు.












Click it and Unblock the Notifications