దొంగల్లా వైసీపీ ఎమ్మెల్యేలు..! స్పీకర్ అయన్న షాకింగ్ కామెంట్స్..!
ఏపీ అసెంబ్లీలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా అసెంబ్లీని బహిష్కరించిన విపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి ప్రశ్నలు రాతపూర్వకంగా సమర్పించి సభకు రాకుండా వెళ్లిపోతున్నారు. దీనిపై కొంతకాలంగా అసెంబ్లీలో చర్చ జరుగుతూనే ఉంది. ఇవాళ దీనిపై స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా స్పందించారు. అయితే ఆయన ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు మాత్రం దుమారం రేపుతున్నాయి.
అసెంబ్లీకి రహస్యంగా వచ్చి వెళ్లిపోతున్న వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి స్పీకర్ దొంగలు అన్న పదం వాడారు. దీనిపై దుమారం రేగుతోంది. అసెంబ్లీకి రెగ్యులర్ గా రావాల్సిన వైసీపీ ఎమ్మెల్యేలు రహస్యంగా దొంగల్లా వచ్చి వెళ్లిపోతున్నారని వ్యాఖ్యానించారు. ప్రశ్నలు అడిగే సభ్యులు సభలో లేకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతున్నట్లు తెలిపారు. సభ్యులు సభకు రావాల్సిందేనని అయ్యన్న తెలిపారు. గవర్నర్ ప్రసంగం తర్వాత వేర్వేరు రోజుల్లో వీరు సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నట్లు గుర్తించామన్నారు.

వైసీపీ సభ్యులు సభకు దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని ఆయన ఆరోపించారు. ఇది మంచి పద్ధతి కాదంటూ వ్యాఖ్యానించారు.ఇది మంచి పద్దతి కాదన్నారు. రిజిస్టర్ లో సంతకాలు చేసిన వారు తనకు సభలో కనిపించడం లేదన్నారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీకి చెందిన మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేల పేర్లను అయన్నపాత్రుడు సభలో చదివి వినిపించారు. ఇందులో బాలనాగిరెడ్డి, విరూపాక్షి, దాసరి సుధ, తాటిపర్తి చంద్రశేఖర్, రేగం మత్సలింగం, అమర్నాథ్ రెడ్డి, విశ్వేశ్వరరాజు ఉన్నారు. ప్రజాప్రతినిధులుగా మిమ్మల్ని జనం ఎన్నుకున్నారని, అటువంటప్పుడు మొహం చాటేయడం ఎందుకన్నారు.












Click it and Unblock the Notifications