చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని షాకింగ్-లక్షకోట్లు అప్పు పెట్టి హైద్రాబాద్ కు-జగన్ పై బ్యాంకుల నమ్మకం
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న పోరులోకి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం దూరారు. ముఖ్యంగావైసీపీ సర్కార్ అప్పులపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్న వేళ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచేందుకు స్పీకర్ ముందుకొచ్చారు. టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబు... జగన్ సర్కార్ అప్పులపై చేసిన విమర్శలకు స్పీకర్ తమ్మినేని ఇవాళ ఓ రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. ఇదే క్రమంలో మాజీ సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన నిర్వాకం వల్లే రాష్ట్రానికి ఈ పరిస్ధితి వచ్చిందన్నారు. దీంతో స్పీకర్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

జగన్ సర్కార్ అప్పులు
ఏపీలో జగన్ సర్కార్ అప్పులపై విమర్శల దాడి నానాటికీ తీవ్రమవుతోంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ... ఇప్పుడు తమ ప్రభుత్వంలో రెండేళ్లలోనే అంతకు రెట్టింపు అప్పుల్ని చేసేసింది. దీంతో తమ అప్పులపై విమర్శలు చేస్తున్న విపక్షాలపై సర్కార్ ఎదురుదాడికి దిగుతోంది. ముఖ్యంగా జగన్ సర్కార్ అప్పులపై నిత్యం నిలదీస్తున్న చంద్రబాబుపై ఇప్పటివరకూ వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తుండగా.. ఇఫ్పుడు స్పీకర్ కూడా ఇవాళ అదే స్ధాయిలో విరుచుకుపడ్డారు.తన ఒకప్పటి బాస్ అయిన చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని చేసిన వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది.

చంద్రబాబు విమర్శలకు తమ్మినేని కౌంటర్
వైసీపీ సర్కార్ భారీగా అప్పులు చేస్తోందంటూ విపక్ష నేత చంద్రబాబు చేస్తున్న విమర్శలకు ఇవాళ స్పీకర్ తమ్మినేని సీతారాం ఘాటు కౌంటర్ ఇచ్చారు. లక్షల కోట్లు అప్పులు చేసి మా నెత్తిమీద పెట్టి హైదరాబాద్ లో కూర్చున్నావని చంద్రబాబును విమర్శించారు. గతంలో టీడీపీ సర్కార్ చేసిన అప్పుల్ని తామే తీరుస్తున్నామని, కాబట్టి చంద్రబాబు చేసే విమర్శలకు విలువ లేదని తమ్మినేని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా ఆయన అప్పులపై మరిన్ని విమర్శలకు దిగారు.

జగన్ పై విశ్వాసంతోనే బ్యాంకుల అప్పులు
చంద్రబాబును టార్గెట్ చేసే క్రమంలో సీఎం జగన్ పైనా స్పీకర్ తమ్మినేని ప్రశంసల జల్లు కురిపించారు. సీఎం జగన్ పై నమ్మకం ఉంది కాబట్టే బ్యాంకులు భారీగా అప్పులు ఇస్తున్నాయని స్పీకర్ అన్నారు. మీరు చేసిన అప్పులు తీర్చుకుంటూ ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకునేందుకు జగన్ నానా కష్టాలు పడుతున్నారని తమ్మినేని సమర్ధించారు. తద్వారా ఇన్ని విమర్శల మధ్య కూడా బ్యాంకుల రుణాల వెనుక ఉన్న సీక్రెట్ ను కూడా స్పీకర్ అలా చెప్పుకొచ్చారు.
Recommended Video

అగ్రిగోల్డ్ ముసుగువీరుల్ని బయటపెడితే..
అగ్రిగోల్డ్ కుంభకోణంలో బాదితులకు సరైన న్యాయం చేయడం లేదంటూ వైసీపీ సర్కార్ పై చంద్రబాబు చేస్తున్న విమర్శల్ని సైతం స్పీకర్ తమ్మినేని తప్పుబట్టారు. అగ్రిగోల్డ్ లో బోర్డు తిప్పేసిన ముసుగువీరులెవరో అందరికీ తెలుసన్నారు. నేనిప్పుడు ఆ పేర్లు చెబితే ఏడ్చి చస్తారని చంద్రబాబును ఉద్దేశంచి స్పీకర్ వ్యాఖ్యానించారు. అగ్రిగోల్డ్ బోర్డు తిప్పేస్తే గతంలో మీ ప్రభుత్వం అండగా నిలిచిందని చంద్రబాబుకు స్పీకర్ గుర్తు చేశారు. ఏమాత్రం సిగ్గు, లజ్జ , ఉచ్చ నీచాలు లేవు మీకు అంటూ చంద్రబాబుపై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ వెళ్లి జూమ్ కాన్ఫరెన్స్ లు పెట్టే మీకు , మీ పార్టీ నేతలకు అగ్రిగోల్డ్ గురించి మాట్లాడే అర్హత ఉందా అని స్పీకర్ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications