Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పై స్పీకర్ తమ్మినేని తుది నిర్ణయం..!!

ఏపీలో ఎన్నికల వేళ మరో కీలక నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ,టీడీపీ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు పార్టీల రెబల్ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను విచారణకు రావాల్సిందిగా అసెంబ్లీ స్పీకర్‌, మండలి చైర్మన్‌లు నోటీసులు ఇచ్చారు. ఇదే తుది విచారణ నోటీసులని పేర్కొంటూ.. హాజరుకాకుంటే అనర్హతపై తుది నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో, ఈ రోజు నిర్ణయం కీలకం కానుంది.

అనర్హత విచారణ: వైసీపీ, టీడీపీ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పై ఈ రోజు స్పీకర్, మండలి ఛైర్మన్ కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలు. అలాగే మండలిలోనూ ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య, వంశీకృష్ణలు పార్టీ ఫిరాయించారు.

AP Assembly Speaker to announce his Decision on Rebel MLAs Disqualification today

వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించిన వీళ్లపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీలో చీఫ్‌విప్‌ మదునూరి ప్రసాదరాజు, మండలిలో చీఫ్‌విప్‌ మేరిగ మురళీధర్‌.. అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌లకు ఫిర్యాదులు చేశారు. అదే విధంగా టీడీపీ నుంచి వైసీపీలోకి మారిన వారి పైన చర్యలు తీసుకోవాలని టీడీపీ ఫిర్యాదు చేసింది.

హాజరు కాలేమంటూ: ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ.. స్పీకర్‌, మండలి చైర్మన్‌లు ఆయా సభ్యుల్ని ప్రశ్నిస్తూ నోటీసులు పంపిస్తూ వచ్చారు. అయితే వీళ్లలో కొందరు అరకోరగా విచారణకు హాజరయ్యారు. మూడుసార్లు నోటీసులు ఇస్తే.. రకరకాల కారణాలతో వాళ్లు విచారణకు గైర్హాజరు అవుతూ వస్తున్నారు.

దీంతో, ఈ రోజున విచారణకు హాజరుకావాల్సిందేనని స్పీకర్‌ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆనంకు నోటీసులు పంపింది. సాయంత్రం 4గం. విచారణ ఉంటుందని.. రాకపోతే తుది నిర్ణయం ప్రకటిస్తామని స్పీకర్‌ స్పష్టం చేశారు. కానీ, ఆనంతో సహా రెబల్ ఎమ్మెల్యేలు తాము ఈ రోజు విచారణకు హాజరు కాలేమని స్పీకర్ కు సమాధానం ఇచ్చారు.

స్పీకర్ తుది నిర్ణయం: అనర్హత పిటిషన్లు వేసిన ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ప్రసాదరాజు, మేరిగ మురళీధర్‌(మండలి) సమక్షంలోనే విచారణ జరగాలి గనుక ఆయనకు కూడా నోటీసులు జారీ చేసింది హాజరు కాకపోతే ఇప్పటిదాకా జరిగిన విచారణ ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందంటూ ఇదివరకే నోటీసుల్లో స్పీకర్‌, చైర్మన్‌లు స్పష్టం చేశారు.

టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యేల విషయంలోనూ విచారణాంతరం నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుంది. వీళ్లను కూడా ఇవాళే విచారణకు రావాల్సిందిగా స్పీకర్‌, మండలి చైర్మన్‌లు నోటీసులు పంపించారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు విచారణకు రాలేమని సమాధానం ఇవ్వటంతో స్పీకర్ ఈ రోజున తుది నిర్ణయం తీసుకుంటారా..ఎలాంటి నిర్ణయం ఉంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+