బాలకృష్ణకు అసెంబ్లీ హెచ్చరిక - టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్..!!
ఏపీ శాసనసభా సమావేశాల ప్రారంభంలోనే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సభ ప్రారంభం కాగానే చంద్రబాబు కేసుల వ్యవహారం పైన టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. స్పీకర్ పోడియం పైకి వెళ్లి నినాదాలు చేసారు. ఆ సమయంలో బాలకృష్ణ మీసాలు తిప్పటం తో మాటల యుద్దం మొదలైంది. ఆ తరువాత సమావేశమైన శాసనసభ బాలకృష్ణ కు హెచ్చరిక చేసింది. ముగ్గురు టీడీపీ సభ్యులను సమావేశాల వరకు... 15 మందిని ఈ రోజు వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ రూలింగ్ ఇచ్చారు.
సభలో గందరగోళం : ఏపీ శాసనసభలో గందరగళ పరిస్థితులు ఏర్పడ్డాయి. చంద్రబాబు అరెస్ట్ పైన టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. స్పీకర్ పోడియం పైక పేపర్లు చింపారు. స్పీకర్ మానిటర్ ను ధ్వంసం చేయటానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రయత్నించారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి టీడీపీ సభ్యులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు.

ఈ సమయంలో నందమూరి బాలకృష్ణ మీసం తిప్పటం పైన మంత్రి అంబటి ఆగ్రహం వ్యక్తం చేసారు. సభలో కాదు సినిమాలో మీసాలు తిప్పాలని పేర్కొన్నాు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాట మాటా పెరిగింది. రెండు పక్షాల నుంచి సభ్యులు ముందుకు దూసుకొచ్చారు. దీంతో, గందరగోళం నడుమ స్పీకర్ సభను వాయిదా వేసారు. బాలయ్యకు పోటీగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి తొడ గొట్టారు.
బాలయ్యకు హెచ్చరిక : బ్రేక్ తరువాత సమావేశమైన సభలో స్పీకర్ కీలక ప్రకటన చేసారు. నందమూరి బాలకృష్ణ సభలో మీసాలు తిప్పటం పైన అభ్యంతరం వ్యక్తం చేసారు. శాసనసభా సంప్రదాయాలను ఉల్లంఘించారని స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. బాలకృష్ణ కు శాసన సభకు మొదటి తప్పుగా భావిస్తూ క్షమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు మరోసారి జరగకుండా వ్యవహరించాలని సభ హెచ్చరిస్తున్నట్లు చెప్పారు.
సభ ఆస్తులకు నష్టం కలిగేలా వ్యవహరించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనగాని సత్య ప్రసాద్ తో పాటుగా పయ్యావుల కేశవ్ ను ఈ సమావేశాల మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో టీడీపీ సభ్యుల తీరు పైన మంత్రి బుగ్గన అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ కు తీర్మానం ప్రతిపాదించారు. దీంతో, ముగ్గురిని సమావేశాలు మొత్తం.. మిగిలిన వారిని ఈ రోజు వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ ప్రకటించారు.

టీడీపీ సభ్యుల సస్పెన్షన్ : చంద్రబాబు కేసుల పైన చర్చించటానికి సిద్దంగా ఉన్నామని మంత్రి బుగ్గన సభలో ప్రకటించారు. బీఏసీ సమావేశంలో దీని పైన నిర్ణయిస్తే ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. అయితే, బీఏసీకి వెళ్లకూడదని టీడీపీ నిర్ణయం తీసుకుంది. సభ రెండో సారి వాయిదా పడటంతో బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు.
ఈ నెల 27వ తేదీ వరకు సభ కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కేసుల వెనుక అంశాలను సభ ద్వారా ప్రజలకు వివరించేందుకు ప్రభుత్వం సిద్దం అవుతోంది. ఈ రోజు సభ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయటంతో, ప్రభుత్వం ఈ రోజు చంద్రబాబు కేసుల అంశాన్ని సభ మందుకు తీసుకొస్తుందా..లేక మరో రోజు నిర్ణయిస్తుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications