AP Assembly : మంత్రి మేరుగు నాగార్జున వ్యాఖ్యల రచ్చ- చర్యలకు టీడీపీ ఎమ్మెల్యే స్వామి పట్టు..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. తొలిరోజే వైసీపీ వర్సెస్ టీడీపీ వార్ మొదలైంది. సభలో వాయిదా తీర్మానాలపై చర్చ కోరుతూ టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. ఈ క్రమంలో పోడియం వద్దకు వెళ్తున్న టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామిని ఉద్దేశించి మంత్రి మేరుగు నాగార్జున చేశారని చెబుతున్న వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే డోలా తీవ్ర అభ్యంతరం చెబుతూ చర్యలకు పట్టుబట్టారు.

మంత్రి మేరుగు నాగార్జున తనను ఉద్దేశించి నువ్వు దళిత పుట్టుక పుడితే చంద్రబాబు పార్టీ టీడీపీ నుంచి బయటికి రా అంటూ వ్యాఖ్యానించారని ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. బాల వీరాంజనేయ స్వామి ఆరోపణలపై స్పందించేందుకు స్పీకర్ మంత్రి నాగార్జునకు అవకాశం ఇచ్చారు. దీంతో ఆయన తాను అలాంటివ్యాఖ్యచేయలేదని, మీ పార్టీ అధినేత చంద్రబాబే దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని గతంలో వ్యాఖ్యానించారంటూ కౌంటర్ ఇచ్చారు.

AP Assembly : tdp mla swamy demands action against minister merugu nagarjuna comments

మంత్రి మేరుగ నాగార్జున రియాక్షన్ పై టీడీపీ ఎమ్మెల్యే డోలా మండిపడ్డారు. మంత్రి మేరుగు నాగార్జున తనపై చేసిన వ్యాఖ్యల వీడియో బయట మీడియాలో వస్తోందంటూ సభలో సెల్ ఫోన్ లో ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. అయితే స్పీకర్ తమ్మినేని దాన్ని అడ్డుకున్నారు. సభలో ఇలాంటి వీడియోలు ప్రదర్శించకూడదన్నారు.దీంతో మీరే మంత్రి వ్యాఖ్యల వీడియో టీవీల్లో ప్రదర్శించమని డిమాండ్ చేశారు. దీనికీ స్పీకర్ అంగీకరించలేదు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టారు. మధ్యలో మరో మంత్రి అంబటి జోక్యంచేసుకున్నా శాంతించకపోవడంతో రచ్చ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+