AP Debts : పట్టువదలని పురందేశ్వరి-అప్పులపై మరో ట్వీట్-కాగ్ రిపోర్ట్ తో సీఎంకే గురిపెట్టి..
ఏపీలో బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే వైసీపీ సర్కార్ అప్పులపై వార్ ప్రారంభించిన దగ్గుబాటి పురందేశ్వరి నిత్యం వరుస ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. ఏపీ ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందంటూ సంచలన ఆరోపణలు చేస్తున్న పురందేశ్వరి.. ఈ క్రమంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కూడా ఫిర్యాదు చేశారు. అయితే విచిత్రంగా అమె ఫిర్యాదు చేసిన తర్వాతే పార్లమెంటులో నిర్మలమ్మ.. ఏపీలో వైసీపీ సర్కార్ చేసిన అప్పు 1.77 లక్షల కోట్లుగా తేల్చేశారు.
అయినా పట్టు విదలని పురందేశ్వరి తన ట్వీట్ వార్ కొనసాగిస్తున్నారు. అంతేకాదు తాజాగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తాను వైసీపీ సర్కార్ అప్పులు రూ.10 లక్షల కోట్లంటూ చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. దీంతో ఈ వ్యవహారంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలతో కౌంటర్లు వేస్తూనే ఉన్నారు. బావ కళ్లల్లో ఆనందం కోసమే పురంధేశ్వరి ఇలా చేస్తున్నారంటూ సాయిరెడ్డి ట్వీట్ కౌంటర్లు విసురుతున్నా పురందేశ్వరి మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

ఇవాళ ఏపీ అప్పులకు సంబంధించి పురందేశ్వరి మరో ట్వీట్ పెట్టారు. అయితే ఈసారి రొటీన్ ఆరోపణలు కాకుండా కాగ్ రిపోర్టును ముందుపెట్టి ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తున్న తీరును ఆమె ప్రశ్నించారు. అంతే కాదు సీఎం జగన్ దీనిపై సమాధానం చెప్పాలని కూడా పురందేశ్వరి డిమాండ్ చేస్తున్నారు. దీంతో కేంద్రం మద్దతుతోనే ఆమె ఇలా అప్పుల్ని టార్గెట్ చేశారా లేక ఏపీలో బీజేపీ బలపడేందుకు వైసీపీని టార్గెట్ చేసే క్రమంలో ఇలా చేస్తున్నారా అన్నది తెలియడం లేదు.
పురందేశ్వరి తాజా ట్వీట్ లో కేవలం ఒక్క సంవత్సరంలోనే (2020-2021) ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లెక్కల్లో చూపకుండారూ.10 లక్షల కోట్లు ఖర్చు, అనధికారికంగా చేసారని కాగ్ తప్పు పట్టిందని పురందేశ్వరి తెలిపారు. వి ప్రజల దగ్గర మద్యం అని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా, ఉద్యోగుల GPS NPS PF లు మరియు గ్రామ పంచాయతీ నిధులు దారి మరల్చినవి కావా? అని ప్రశ్నించారు. ఇదే కదా నేను చెప్పినది. సీఎం గారూ, దీనికి మీ సమాధానం ఏమిటి అని పురందేశ్వరి అడిగారు.












Click it and Unblock the Notifications