Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పురందేశ్వరి నిర్ణయాలకు బ్రేకులు - తెర వెనుక..!!

ఏపీలో మూడు పార్టీల కూటమి అధికారంలోకి వచ్చింది. మూడు పార్టీల నుంచి మంత్రులు ప్రభుత్వంలో ఉన్నారు. బీజేపీ నుంచి ఒక్కరికే మంత్రిగా అవకాశం దక్కింది. రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురందేశ్వరికి కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని భావించినా..శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. ఇక..నామినేటెడ్ పదవుల విషయంలోనూ పార్టీ నేతలకు పురందేశ్వరి హామీ ఇవ్వటం లేదు. పురందేశ్వరి నిర్ణయాల కు బ్రేకులు పడుతున్నాయా. కేంద్ర పార్టీ ఏం చేస్తోంది.

మారుతున్న లెక్కలు
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా మారింది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా...ఢిల్లీ స్థాయిలోనే నిర్ణయాలు జరగుతున్నాయి. పురందేశ్వరికి కేంద్ర మంత్రి పదవి దక్కకుండా సొంత పార్టీతో పాటుగా పలు రాజకీయ సమీకరణాలు తెర వెనుక పని చేసాయనే అభిప్రాయం ఉంది. పార్టీలో మూడు దశాబ్దాలుగా పని చేసిన శ్రీనివాసవర్మకు అనూహ్యంగా ఎంపీ సీటు ఇవ్వటంతో పాటుగా తొలి సారి గెలిచిన ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. పురందేశ్వరి ఆ సమయం నుంచి పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నా...విధాన పరమైన నిర్ణయాల్లో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

AP BJP Chief Purandeswari discussions with party high command over Nominated posts

బీజేపీ నేతల వినతి
ఏపీలో ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉండటంతో పదవుల కోసం కమలం పార్టీ నేతలు పురందేశ్వరిని సంప్రదిస్తున్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో తమకు ప్రాధాన్యత గురించి ప్రస్తావిస్తున్నారు. అయితే, కేంద్రంలో టీడీపీ కీలకంగా ఉండటంతో..ఇక్కడ బీజేపీ నేతలు ఎలాంటి డిమాండ్లు బలంగా వినిపించలేక పోతున్నారు. సర్దుబాటు ధోరణితో వ్యవహరిస్తున్నారు. పదవుల కోసం డిమాండ్ చేయలేని స్థితిలో బీజేపీ నేతలు ఉన్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో టికెట్లు దక్కని పలువురు సీనియర్లు నామినేటెడ్ పదవుల పైన ఆశలు పెట్టుకున్నారు.

బీజేపీకి ప్రాధాన్యత దక్కేనా
కొందరు ముఖ్య నేతలు పురందేశ్వరిని కలిసి తమకు పదవులు వచ్చేలా చూడాలని కోరుతున్నారు. అయితే, వారికి పురందేశ్వరి ఎలాంటి హామీ ఇవ్వటం లేదు. తాను ప్రతీ అంశాన్ని పార్టీ అధినాయకత్వానికి నివేదిస్తానని చెబుతున్నారు. ఏదైనా పదవులు కావాలంటే కేంద్ర నాయకత్వాన్ని కలవాలని సూచిస్తున్నారు. టీటీడీ బోర్డుతో సహా రాష్ట్ర స్థాయిలో పదవుల విషయంలో చంద్రబాబుకు సిఫార్సు చేయటానికి పురందేశ్వరి సుముఖంగా లేనట్లు కనిపిస్తోంది. మూడు పార్టీలు కూటమిలో ఉండటం..కేంద్రంలో టీడీపీ పాత్ర కీలకంగా మారిన సమయంలో..బీజేపీ నేతలకు ఏ స్థాయి పదవులు వస్తాయనేది చర్చగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+