పవన్ కామెంట్స్ కు స్పందించాలా? జనసేనతో పొత్తుపై అధిష్టానమే చెప్పాలన్న పురందేశ్వరి..
ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత మారుతున్న రాజకీయ పరిస్ధితుల్లో బీజేపీ-జనసేన పొత్తు కూడా ప్రశ్నార్ధకంగా మారింది. చంద్రబాబును రాజమండ్రి జైల్లో పరామర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అనంతరం టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటన చేశారు. దీంతో అప్పటివరకూ జనసేనతోనే మా పొత్తు అంటూ చెప్తూ వచ్చిన బీజేపీకి గట్టి షాక్ తగిలింది. దీంతో ఎలా స్పందించాలో తెలియక జాతీయ నాయకత్వంపైనే భారం మోపిన బీజేపీ నేతలు ఇవాళ భేటీ అయ్యారు.
ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్భంగా సేవా పక్షోత్సవాలు ఎలా జరిగాయనే అంశంపై విశ్లేషించుకునేందుకు ఇవాళ విజయవాడలో భేటీ అయిన బీజేపీ కోర్ కమిటీ పలు అంశాలపై చర్చించింది. ఇందులో చంద్రబాబు అరెస్టు తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు, పొత్తులు, పవన్ ప్రకటనలపైనా చర్చించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ చేసే ప్రతి కామెంట్ కు తాను స్పందించాల్సిన అవసరం లేదని దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్య చేశారు.గతంలో పవన్ తో త్వరలో భేటీ కానున్నట్లు చెప్పిన పురందేశ్వరి.. ఇవాళ మాత్రం పవన్ వ్యాఖ్యలపై స్పందించబోనన్నారు. పొత్తులపై పవన్ ప్రకటన, ఆయన అభిప్రాయాలను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తాం. పొత్తులు, పవన్ కామెంట్ల విషయంలో జాతీయ పార్టీ సూచనల మేరకు వ్యవహరిస్తామని మాత్రమే చెప్పారు.
ప్రస్తుతం జనసేన తో పొత్తు కొనసాగుతుందా..? లేదా..? అనే అంశం పైనా జాతీయ నాయకత్వమే చెప్పాలని పురందేశ్వరి కోరారు. పొత్తులపై పవన్ తన అభిప్రాయాన్ని చెప్పారని, తమ అభిప్రాయాన్ని జాతీయ నాయకత్వమే చెబుతుందని తెలిపారు. తమది ప్రాంతీయ పార్టీ కాదని, జాతీయ పార్టీ అని అన్నారు.












Click it and Unblock the Notifications