సజ్జలపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు - ఫిర్యాదు చేసాం..!!

ఎన్టీఆర్‌ నాణెం ఆవిష్కరణలో తమ కుటుంబం అంతా పాల్గొందని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి చెప్పారు. నందమూరి వారసులు కూడా తాతపై ప్రేమతో పాల్గొన్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రపతి భవన్‌ లో జరిగిన కార్యక్రమంపై సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల పైన పురందేశ్వరి స్పందించారు. కేంద్రం ఏపీకి చేసిన సాయం, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను తమ ప్రతినిధులు వివరిస్తారని పురంధేశ్వరి అన్నారు. ఎన్నిక ల సమయానికి అందరూ సన్నధ్దం కావాలని పిలుపిచ్చారు.

టీటీడీ బోర్డులో నియామకాలపైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అభ్యంతరం వ్యక్తం చేసారు. మనోభావాలు దెబ్బ తినేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని..దీని పైన పార్టీ తరపున పోరాటం చేస్తామని ప్రకటించారు. పేదల కోసం గ్యాస్‌పై రూ. 2 వందలు తగ్గిస్తే.. దాన్ని రాజకీయం చేయడం తగదని అన్నారు. కేంద్రం ఏపీకి చేసిన సాయం, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను తమ ప్రతినిధులు వివరిస్తారని పురంధేశ్వరి అన్నారు. ఎన్నికల సమయానికి అందరూ సన్నధ్దం కావాలని పిలుపిచ్చారు. సోషల్ మీడియా ఎంతో కీలకంగా పనిచేస్తోందని, సమాజంలో సోషల్ మీడియా అంశాలపైనే చర్చ సాగుతోందన్నారు. సోషల్ మీడియాలో ఎలా పని‌చేయాలో శిక్షణ ఇస్తామన్నారు.

AP BJP Chief Purandeswari made key comments against Sajjala and Sai Reddy

రాష్ట్రంలో గ్రామ పంచాయతీల నిధులు మళ్లింపుపై తాము పోరాటం చేశామని, బీజేపీ మిత్ర పక్షమైన జనసేనతో కలిసి ఆందోళనలు నిర్వహించామని పురంధేశ్వరి తెలిపారు. అన్ని అంశాలను గవర్నర్‌కు, కేంద్రంలో పెద్దలకు ఫిర్యాదు చేశామన్నారు. 'నా భూమి, నాదేశం‌' కార్యక్రమం బీజేపీ చేపట్టిందని, సెప్టెంబరు ఒకటి నుంచి 15 వరకు అన్ని గ్రామాల్లో మట్టిని సేకరిస్తామన్నారు. పట్టణాలు, నగరాల్లో బియ్యం సేకరిస్తామని, ఆ మట్టిని ఢిల్లీ తీసుకెళ్లి అక్కడ అన్ని రాష్ట్రాల మట్టితో అమృత వనం ఏర్పాటు చేస్తామని పురంధేశ్వరి స్పష్టం చేశారు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మోదీ అనేక కార్యక్రమాలు చేపట్టారని, రాఖీ పండుగ సందర్భంగా సోదరీమణుల కోసం గ్యాస్ సిలిండర్ ధర తగ్గించారన్నారు.

ఎన్టీఆర్‌ నాణెం ఆవిష్కరణలో తమ కుటుంబం అంతా పాల్గొందని చెప్పిన పురందేశ్వరి..తాత పైన ప్రేమతో తమ తరువాతి వారసులు కూడా పాల్గొన్నారని చెప్పుకొచ్చారు.ఎన్టీఆర్‌ నాణెం ఆవిష్కరణలో తమ కుటుంబం అంతా పాల్గొందని, మా తరువాత వారసులు కూడా తాతపై ప్రేమతో పాల్గొన్నారని చెప్పారు. రాష్ట్రపతి భవన్‌ లో జరిగిన కార్యక్రమంపై సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని, రాష్ట్రపతి పాల్గొన్న కార్యక్రమాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. విజయసాయి రెడ్డి ల వ్యాఖ్యలపై తాను స్పందించదనని పురందేశ్వరి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+