Somu Veerraju : త్వరలో వైసీపీ సర్కార్ పై ఛార్జిషీట్ -సోము వీర్రాజు ప్రకటన
ఏపీలో వైసీపీ ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇవాళ మరో ప్రకటన చేసారు. ఈ మధ్య కాలంలో జనసేన ప్రస్తావన లేకుండానే వైసీపీపై పోరు ప్రకటనలు చేస్తున్న సోము ఇదే క్రమంలో ఇవాళ మరో అంశంపై ప్రకటన చేశారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పర్యటించారు. రాయలసీమ పశ్చిమ ఎమ్మెల్సీ అభ్యర్థి రాఘవేంద్రని గెలిపించాలని కోరుతూ ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ, టీడీపీ నేతలు సోము వీర్రాజు సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం పై త్వరలో చార్ట్ షీట్ వేస్తామని సోమువీర్రాజు ప్రకటించారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందన్నారు. వైసీపీ కి తాము మాత్రమే ప్రత్యామ్నాయం అన్నారు.

కర్నూలు జిల్లా లో అధికార పార్టీ ఎమ్మెల్యే,ఒక మంత్రి కూడా భూకబ్జాలకు పాల్పడుతున్నారన్నారని సోము వీర్రాజు ఆరోపించారు. వారిని అడ్డుకునే ప్రభుత్వం రావాలంటే బీజేపీని ప్రజలు బలపర్చాలన్నారు. కర్నూలుకు కేంద్రం సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చిందని, లక్షకోట్లతో రాయలసీమలో జాతీయ రహదారులు అభివృద్ధి చేసామని సోము గుర్తుచేశారు. రైల్వే లైన్ ఆధునీకరణ కూడా చేస్తామన్నారు. రాయలసీమ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న బీజేపీకి ఓటర్లు ఈసారి మద్దతునివ్వాలని సోము కోరారు.












Click it and Unblock the Notifications