బీజేపీ కార్యవర్గ భేటీలో సోము హాట్ కామెంట్స్-పవన్, జనసేన ఊసెత్తకుండానే..
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు స్పీడు పెంచుతున్నాయి. ఇప్పటికే జనసేనతో కలిసి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఇవాళ జరిగిన రాష్ట్ర కార్యవర్గ భేటీలో పొత్తులకు సంబంధించి దాదాపు క్లారిటీ ఇచ్చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ మేరకు హాట్ కామెంట్స్ చేశారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ లో అవినీతి, కుటుంబ, వారసత్వ రాజకీయాలకు దూరంగా సమర శంఖారావం పూరిస్తున్నామని ఆయన తెలిపారు. 2014 తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ లో అవినీతి తప్ప మరేమీలేదన్నారు. వారసత్వ, కుటుంబ రాజకీయాలను కూల్చడమే బీజేపీ ధ్యేయమని సోము తెలిపారు. అదే ఉద్దేశ్యంతో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటున్నామన్నారు.

ఏపీలో జరుగుతున్న అవినీతి తేల్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని సోము వీర్రాజు వెల్లడించారు. జగన్ సర్కార్ కు సంక్షేమం అంటే తొమ్మిది మాత్రమేనన్నారు. జగన్ నవరత్నాలు ఎక్కువా, మోడీ సంక్షేమం ఎక్కువా తేల్చేందుకు బీజేపీ సిద్ధమన్నారు. ఎన్నికల్లో బటన్ నొక్కి బీజేపీ ప్రభుత్వం తీసుకురావాలంటూ సోమువీర్రాజు పిలుపునిచ్చారు.
బీజేపీ పొత్తు రాష్ట్రంలోని 3 కోట్ల మంది ప్రజలతో, జనంతో మాత్రమేనన్నారు. జీవో 1 పై జగన్ సర్కార్ వైఖరి కరెక్ట్ కాదని, తాము దీన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇలాంటి జీవోలు ఉంటే జగన్ పాదయాత్ర చేసేవారా అని ప్రశ్నించారు.

జగన్ ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ బీజేపీ యేనన్నారు. తిరుపతి లో రూమ్ ల అద్దె పెంపుపై ఛలో తిరుపతి నిర్వహిస్తామని సోము తెలిపారు. రేషన్ బియ్యం, ఎన్. ఆర్.ఈ. జి.ఎస్ లలో అక్రమాలపై, రైతు క్షేమం కోసం బీజేపీ ఉద్యమాలు చేపట్టనుందన్నారు. ఏపీలో సర్పంచ్ ల సమస్యలపైనా బీజేపీ ఉద్యమం చేయనుందని వెల్లడించారు. ప్రజా పోరు రెండో విడత యాత్రపై స్పందిస్తూ.. మార్చి 10 నుండి 30 వరకూ పాదయాత్రతో బీజేపీ ప్రజల్లోకి రాబోతుందన్నారు. రాష్ట్రంలో జరిగిన అవినీతి కి వ్యతిరేకంగా 8 వేల ప్రాంతాల్లో లక్ష ప్రజా చార్జీషీట్లతో ప్రజల్లోకి వెళ్తామన్నారు. 15 వేల కిలోమీటర్లు ఈ పాదయాత్ర ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications