బీజేపీ కొత్త చీఫ్ మాధవ్ తొలి డిమాండ్ - మార్చాల్సిందే..!!
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా అనూహ్యంగా ఎంపిక అయిన మాధవ్ పార్టీ పగ్గాలు చేపట్టారు. సుదీర్ఘ కాలం మాధవ్ కుటుంబం పార్టీకి చేసిన సేవలను గుర్తించి పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేసారు. పలువురు ముఖ్య నేతలు రేసులో నిలిచినా.. చివరకు మాధవ్ కు పార్టీ బాధ్యతలు అప్పగించింది. పార్టీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత ర్యాలీ నిర్వహించారు. ఎన్డీఏ పార్టీల సమన్వయం గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. అదే సమయంలో అధ్యక్షుడి హోదాలో తొలి డిమాండ్ తెర మీదకు తెచ్చారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన పీవీఎన్ మాధవ్ విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో బీజేపీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిం చారు. లెనిన్ సెంటర్ లో విశ్వనాథ సత్యనారాయణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. పార్టీ కార్యాలయంలో మాజీ అధ్యక్షురాలు, బీజేపీ ఎంపీ పురంధరేశ్వరి మాధవ్‌కు అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. అనంతరం మాధవ్ ఏపీ నూతన బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కూటమి పార్టీల సమన్వయంపై కీలక కామెంట్స్ చేశారు. పార్టీలో అందరినీ కలుపుకొని ముందకెళ్తానని మాధవ్ అన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీలో అందరి నేతలతో చర్చించి తీసుకుంటానని మాధవ్ వెల్లడించారు.

రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి అందరి సలహాలు, సూచనలు తీసుకుంటానని చెప్పారు. కూటమి పార్టీలను సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకొని వెళ్తానని చెప్పారు. కూటమి పార్టీలపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని వెల్లడించారు. ఇదే సమయంలో కొత్త డిమాండ్ తెర మీదకు తెచ్చారు. విజయవాడలో లెనిన్ సెంటర్‌కు విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టాలని మాధవ్ డిమాండ్ చేసారు.

లెనిన్ కు మన ప్రాంతానికి ఏంటి సంబంధమని ప్రశ్నించారు. మన దేశానికి ఎలాంటి సంబంధం లేనప్పుడు లెనిన్ పేరు పెట్టాల్ సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. లెనిన్ సెంటర్ పేరు మార్చి విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టాలని మాధవ్ ఈ సందర్భంగా డిమాండ్ చేసారు. దీంతో, ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడి హోదాలో చేసిన ఈ డిమాండ్ ఎంత వరకు అమలు అవుతుందనేది ఆసక్తి కరంగా మారు తోంది.












Click it and Unblock the Notifications