Vizag Steel : వైజాగ్ స్టీల్ కు కేసీఆర్ సర్కార్ బిడ్ ప్లాన్ - బీజేపీ రియాక్షన్ ఇదే..

ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొనుగోలు కోసం ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలు చేసేందుకు ఈ నెల 27న బిడ్లు ఆహ్వానించారు. దీనిపై స్పందించిన కేసీఆర్ సర్కార్ తాము సింగరేణి లేదా నీటిపారుదల అభివృద్ధి సంస్ధ తరఫున బిడ్లు వేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇది ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవుతోంది.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొనుగోలుకు బిడ్ వేయాలన్న కేసీఆర్ సర్కార్ నిర్ణయం బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. అదే జరిగితే బీజేపీతో పాటు ఆ పార్టీకి మద్దతిస్తున్న ప్రాంతీయ పార్టీలకు చుక్కలు కనపడడం ఖాయం. దీంతో ఇవాళ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కేసీఆర్ సర్కార్ నిర్ణయంపై వ్యంగంగా స్పందించారు. కేసీఆర్, కేటీఆర్ గారు, అమ్మకు అన్నం పెట్టనోడు, చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తడట! అంటూ సెటైర్లు వేశారు.

తెలంగాణ తల్లికి సింగరేణితో కలిసి బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టిస్తానని కోతలు కోసి నాలుగేళ్లు దాటిపోయింది. పునాది కూడా పడలేదని బీజేపీ నేత విష్ణు తెలిపారు. మొన్న : సింగరేణిని మోదీ ప్రైవేటుపరం చేస్తున్నారని ఆందోళనలు !

 kcr-bjp
ఇవాళ : సింగరేణితో విశాఖ స్టీల్ ప్లాంట్‌నే కొనిస్తామని ప్రగల్భాలు ! అంటూ విమర్శించారు. నర్సీ ... ఇలా అయితే దొరికిపోతామని మీకేవరూ చెప్పలేదా ? లేక ప్రజలను పిచ్చోళ్లనుకుంటున్నారా ? అని ప్రశ్నించారు. కానీ విశాఖ ఉక్కు పేరుతో మరో మోసం. మీ తండ్రీ కొడుకులకు ప్రజలు ఓ మాదిరిగా కూడా కనిపించరా? అని విష్ణు నిలదీశారు.

సెంటిమెంట్, ఆయింట్ మెంట్ రాజకీయాలతో తెలంగాణ, ఆంధ్రసమాజాన్ని తొమ్మిదేళ్లుగా మోసం చేస్తున్నారని, ఆంధ్రా ప్రాంతంలో నష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కును బతికించడానికి కేంద్రం ఓవైపు పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తుంటే దుష్ప్రచారం చేస్తున్నారని విష్ణు కేసీఆర్ సర్కార్ పై మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో ఏపీలో లబ్ది పొందడం కోసం తెలంగాణ సెంటిమెంట్ తో వచ్చిన రాష్ట్రానికి చేసిన మోసం తరహాలోనే ఇక్కడా మోసం చేయాలని చూస్తున్నారన్నారు.

ఆత్మహత్యలతో సహా ఏ అంశాన్ని అయినా వాడుకునేందుకు ఆరితేరిన కేసీఆర్, కేటీఆర్.. సింగరేణి తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలది. కేంద్ర ప్రభుత్వ సంస్ధ అమ్మేస్తామని గతంలో ప్రచారం చేసిన వారు ఇప్పుడు టెండర్ ఎలా వేస్తారని ప్రశ్నించారు. గతంలో బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పేరుతో మోసం చేసిన కేసీఆర్..ఇప్పుడు ఆ హామీల్ని ముందు నిలబెట్టుకోవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+