బట్టలిప్పదీసి నడి బజారులో..-జగన్ కు బీజేపీ నేత మాస్ వార్నింగ్..!

ఏపీలో వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత వైసీపీ వర్సెస్ కూటమి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నేపథ్యంలో విజయవాడ జైల్లో వంశీని ఇవాళ పరామర్శించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దిగారు. సప్రసముద్రాల అవతల ఉన్నా తప్పు చేసిన వారిని వదిలిపెట్టం అంటూ అధికారులకు సైతం హెచ్చరికలు చేశారు. దీనిపై స్పందించిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వల్లూరు జయప్రకాష్ నారాయణ అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

జగన్మోహన్ రెడ్డి బట్టాలిప్పదీసి నడి బజారులో తన్నుకుంటూ తీసుకువెళతాం అంటూ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.విజయవాడలో జగన్ చేసిన కామెంట్స్ పై ఆయన గుంటూరులో స్పందించారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు చూసి జగన్మోహన్ రెడ్డికి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడన్నారు. కేంద్ర బడ్జెట్ పేద బడుగు బలహీన వర్గాలకు అనుకూలంగా ఉందనేది సత్యం అన్నారు.

ap bjp secretary valluru Jayaprakash Narayana derogatory remarks against ys jagan

విజయవాడలో జైల్ ములాఖత్ పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రేలాపనలు చూస్తే నవ్వొస్తుందని వల్లూరు జయప్రకాష్ నారాయణ తెలిపారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ప్రజలందరి బట్టలు విప్పదీసి బజారులో నిలబెట్టిన సంగతిని జగన్ మర్చిపోయినట్లు ఉన్నాడన్నారు. కూటమి వారిని బట్టాప్పదీసి నిలబెడటం సంగతి అట్లవుంచి, ఆయన పార్టీ వారి బట్టలు విప్పతీసి ప్రజలు వెంబడించి కొట్టడం ఖాయం అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు బట్టాలిప్పదీసి కొట్టుకుంటూ నడి బజారులో నడిపించడం ఖాయం అంటూ సవాల్ విసిరారు. ఇప్పట్టికైనా జగన్మోహన్ రెడ్డి తీరు మార్చుకోకుంటే మేమే బట్టలిప్పదీసి తంతామని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+