వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

AP Budget 2021 : ఏపీ బడ్జెట్ హైలైట్స్... ఏ రంగానికి ఎంత కేటాయించారంటే...

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ 2021-22ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,29,779 కోట్ల అంచనాతో బడ్జెట్‌ కేటాయింపులకు రూపకల్పన చేశారు. వ్యవసాయం,విద్య,వైద్య రంగాలకు,వైఎస్సార్ పెన్షన్ వంటి పథకాలకు భారీగా కేటాయింపులు జరిపారు. వెనుకబడిన కులాలకు బడ్జెట్‌లో 32 శాతం కేటాయింపులు జరపడం గమనార్హం. ఐక్యరాజ్య సమితి సూచించిన 17 సుస్థిర అభివృద్ది లక్ష్యాలను సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా బుగ్గన పేర్కొన్నారు.

Recommended Video

AP Budget 2021 Allocations ఏయే రంగానికి ఎంత ? | CM YS Jagan | COVID19 || Oneindia Telugu

ఏయే రంగానికి ఎంత కేటాయింపులు :

వైద్యం, ఆరోగ్యం - 13,830 కోట్లు
వైఎస్సార్ రైతు భరోసా - 3845 కోట్లు
జగనన్న వసతి దీవెనకు - రూ.2,223.15 కోట్లు
పిల్లల సంక్షేమ,అభివృద్ది కోసం -రూ.16వేల 748 కోట్లు
మహిళాభివృద్దికి -రూ.47,283కోట్లు
వ్యవసాయ పథకాలకు - రూ.11,210 కోట్లు
విద్యా పథకాలకు - రూ.24,624కోట్లు
వైఎస్ఆర్ ఫించన్ కానుక -రూ.17వేల కోట్లు
వైఎస్ఆర్ పీఎం ఫసల్ భీమా యోజనకు -రూ.1802కోట్లు

ap budget 2021 buggana introduced the budget and here is details of allocations

అమ్మ ఒడి కోసం - రూ.6,107కోట్లు
హౌసింగ్ మౌలిక సదుపాయాలకు - రూ.5,661 కోట్లు
ఈబీసీ సంక్షేమానికి - రూ.5478 కోట్లు
కాపు సంక్షేమానికి - 3306 కోట్లు
బ్రాహ్మణుల సంక్షేమానికి - రూ.359 కోట్లు
ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు - రూ.17,403 కోట్లు
ఎస్టీ సబ్ ప్లాన్ - 6131 కోట్లు
మైనారిటీ యాక్షన్ ప్లాన్ - రూ.3840 కోట్లు
రైతులకు సున్నా వడ్డీ కింద చెల్లింపుల కోసం రూ.500 కోట్లు
డ్వాక్రా సంఘాలకు వైఎస్సార్ సున్నా వడ్డీ కింద చెల్లింపులకు రూ.1,112 కోట్లు
వైఎస్సార్ జగనన్న చేదోడు పథకం కోసం రూ.300 కోట్లు
వైఎస్సార్ వాహన మిత్ర పథకం కోసం రూ. 285 కోట్లు
వైఎస్సార్ నేతన్న నేస్తం కోసం రూ.190 కోట్లు
వైఎస్సార్ మత్స్యకార భరోసా కోసం రూ.120 కోట్లు
మత్స్యకారులకు డీజిల్‌ సబ్సిడీ కోసం రూ.50 కోట్లు
అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపుల కోసం రూ.200 కోట్లు
రైతులకు ఎక్స్‌గ్రేషియా కింద రూ.20 కోట్లు, లా నేస్తం కోసం రూ.16.64 కోట్లు
వైఎస్సార్ ఆసరా కోసం రూ.6,337 కోట్లు, అమ్మ ఒడి కోసం రూ.6,107 కోట్లు
వైఎస్సార్ చేయూత కోసం రూ.4,455 కోట్లు

బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ... వజ్ర సంకల్పం,దృఢ నిశ్చయంతో సవాళ్లను ఎదుర్కోవడం,అంచనాలను అధిగమించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి లక్షణాలుగా పేర్కొన్నారు. ఆయన సున్నిత ప్రవర్తన,సంక్షేమానికి ఇచ్చే ప్రాధాన్యత అందరికీ ప్రేరణగా నిలుస్తుందన్నారు. కోవిడ్ పరిస్థితుల్లో ఒకవైపు ప్రజల ప్రాణాలు కాపాడుతూనే ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కోవిడ్‌పై పోరాటంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరును బ్రిటీష్ హైకమిషన్ ప్రశంసించిందని గుర్తుచేశారు.

అంతకుముందు,రాష్ట్ర కేబినెట్ సమావేశమై బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ సమావేశానికి ముందు మంత్రి బుగ్గన ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుగ్గన బడ్జెట్ ప్రసంగం అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడనున్నారు. ఆ తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడనుంది.

English summary
Andhra Pradesh Finance Minister Buggana Rajendranath Reddy has introduced the Budget 2021-22 in the state Assembly on Thursday. The budget is designed for allocations with a total estimate of Rs. .2,29,779. Huge allocations were made for agriculture, education, medicine and YSSAR pension schemes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X