Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ చేతికి కూటమి 'బడ్జెట్' బ్రహ్మాస్త్రం..!!

AP Budget 2025-26: ఏపీ ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. తొలి సారి మూడు లక్షల కోట్లకు పైగా అంచనాలతో బడ్జెట్ రూపకల్పన చేసారు. తాము ప్రాధాన్యత అంశాలు గా భావిస్తున్న వాటికి అధిక కేటాయింపులు చేసారు. ఆదాయం - అప్పుల అంశంలోనూ బడ్జెట్ లో చూపించిన గణాంకాలు చర్చగా మారుతున్నాయి. ఇదే సమయంలో సూపర్ సిక్స్ హామీల కోసం చేసిన కేటాయింపుల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక.. ఇప్పుడు ఈ బడ్జెట్ మాజీ సీఎం జగన్ కు కొత్త అస్త్రంగా మారనుందా. జగన్ ఏ అంశం పై నిలదీసే ఛాన్స్ ఉంది...

బడ్జెట్ కేటాయింపులు
కూటమి ప్రభుత్వం తొలి సారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఇందులో సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. విద్య, మనవ వనరులు, పంచాయితీ రాజ్ శాఖలకు పెద్ద మొత్తంలో నిధులు ప్రతిపాదించారు. ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అవుతున్నా.. హామీలు అమలు చేయటం లేదనే విమర్శల వేళ సూపర్ సిక్స్ లో రెండు ప్రధాన పథకాలకు నిధులను బడ్జెట్ లో కేటాయించారు. ఇప్పుడు ఈ కేటాయింపులు... కేటాయించని ఇతర హామీల పైన మాజీ సీఎం జగన్ నిలదీసే అవకాశం కనిపిస్తోంది. సూపర్ సిక్స్ లో మూడు ప్రధాన హామీలను బడ్జెట్ లో ప్రస్తావన చేయకపోవటం జగన్ కు రాజీయంగా అస్త్రం అందించినట్లేనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

AP Budget Allocations chances to becomes as Political weapon for YS Jagan

కేటాయింపుల పై
ఇప్పటికే వైసీపీ బడ్జెట్ కేటాయింపుల పైన స్పందించింది. తల్లికి వందనం పథకం కోసం రాష్ట్రం లో ఉన్న 81 లక్షల మంది విద్యార్ధుల కు రూ 15 వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేసేందు కు రూ 12 వేల కోట్లు కావాలని మాజీ మంత్రి బొత్సా విశ్లేషించారు. ఇప్పుడు బడ్జెట్ లో ఈ పథకం కోసం రూ 9400 కోట్లు కేటాయించారు. అదే విధంగా అన్నదాత సుఖీభవ కోసం రాష్ట్రంలోని దాదాపు 55 లక్షల మంది రైతుల కోసం రూ 12 వేల కోట్లు కావాల్సి ఉండగా..బడ్జెట్ లో రూ 6300 కోట్లు కేటాయించటం పైన ప్రశ్నించారు. ఈ రెండు పథకాలనే బడ్జెట్ లో ప్రస్తావించినా..వాటికీ పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వలేదని బొత్సా విమర్శించారు.

Take a Poll

ఆ పథకాలు ఏవీ
ఇక, సూపర్ సిక్స్ పథకాల్లో మహిళలకు ఉచిత బస్సు గురించి బడ్జెట్ లో ప్రత్యేకంగా ప్రస్తావన లేదు. అదే విధంగా మహిళలకు ప్రతీ నెలా రూ 1500 గురించి ఊసే లేదు. ఉపాధి కల్పించే వరకూ ప్రతీ నిరుద్యోగికి రూ 3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీ గురించి బడ్జెట్ లో పేర్కొనలేదు. ఇక.. ఉద్యోగులకు ఎలాంటి హామీ దక్కలేదు. ఇప్పటికే చంద్రబాబు మేనిఫెస్టో అమలు చేయరని.. పథకాలు అమలు కావంటూ విమర్శిస్తున్న జగన్ కు తాజా బడ్జెట్ లో కేటాయింపులు... ఇవ్వాల్సిన పథకాల పైన ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఉగాది నుంచి జగన్ జిల్లాల పర్యటనలకు సిద్దం అవుతున్నారు. దీంతో, ఇప్పుడు జగన్ రాజకీయంగా ఈ అంశాన్ని ఏ విధంగా మలచుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+