అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. దాదాపు రూ.2.11 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అయితే ఈ ఒక్కరోజు జరిపే ఈ బడ్జెట్ సమావేశాలను ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బహిష్కరించాలని నిర్ణయించింది. అయితే ప్రధాన ప్రతిపక్షం లేకుండానే ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మూడునెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పోను మిగతా తొమ్మిది నెలలకు బడ్జెట్ ప్రవేశపెడుతుంది. అంతకుముందు కేబినెట్ సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతుంది. ముందుగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రెండు సభలనుద్దేశించి ఆన్‌లైన్ ద్వారా ప్రసంగిస్తారు. గవర్నర్ బడ్జెట్ ప్రసంగం తర్వాత నేరుగా ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. కరోనా కారణంగా ఒక్కరోజుకే ప్రభుత్వం సమావేశాలను పరిమితం చేసింది. గతేడాది రెండు రోజులు నిర్వహించింది.
ఇదిలా ఉంటే ఆరు నెలలలోపు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించకపోతే ప్రభుత్వం కూలిపోతోందన్న భయంతోనే సమావేశాలు నిర్వహిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు విమర్శలు సంధించారు. అయితే టీడీపీ విమర్శలకు వైసీపీ నాయకులు కూడా ఘాటైన కౌంటర్లు ఇస్తున్నారు. ఇక బడ్జెట్‌కు సంబంధించి పూర్తి వివరాలు మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం
May 20, 2021, 4:22 pm IST
ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. ఒక్కరోజుతోనే బడ్జెట్ సమావేశాలు ముగింపు. సభకు హాజరుకాని ప్రతిపక్షం
May 20, 2021, 3:39 pm IST
2021-22 రాష్ట్ర బడ్జెట్ అంచనా రూ.2,29,779.27 కోట్లు. 2021-22 బడ్జెట్‌కు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం.
May 20, 2021, 3:38 pm IST
రెవెన్యూ వ్యయం - రూ.లక్షా 82 వేల 196 కోట్లు
May 20, 2021, 3:38 pm IST
మూలధన వ్యయం - రూ.47,582 కోట్లు
May 20, 2021, 3:38 pm IST
రెవెన్యూ లోటు - రూ.5 వేల కోట్లు
May 20, 2021, 3:38 pm IST
ద్రవ్యలోటు - రూ.37,029.79 కోట్లు
May 20, 2021, 3:38 pm IST
జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు 3.49 శాతం
May 20, 2021, 3:37 pm IST
రెవెన్యూ లోటు 0.47 శాతం
May 20, 2021, 3:32 pm IST
2021-22 బడ్జెట్‌కు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం
May 20, 2021, 3:31 pm IST
వ్యాక్సిన్లు ఎలాగైనా తెస్తాం.. ప్రజలకు ఉచితంగానే ఇస్తాం: సీఎం జగన్
May 20, 2021, 3:23 pm IST
రాష్ట్రంలో ప్రతి రోజు లక్ష కరోనా టెస్టులు చేస్తున్నాం: సీఎం జగన్
May 20, 2021, 3:17 pm IST
23 నెలల్లో కులం, మతం, ప్రాంతం లాంటి ఎలాంటి భేదభావం చూపకుండా పథకాలను అందించాం: సీఎం జగన్
May 20, 2021, 3:15 pm IST
అర్హులైన ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి: సీఎం జగన్
May 20, 2021, 3:14 pm IST
క్యాలెండర్‌లో పొందుపర్చిన విధంగా పథకాలను అమలు చేస్తున్నాం: సీఎం జగన్
May 20, 2021, 3:12 pm IST
రెండేళ్లలోనే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 94.5 శాతం నెరవేర్చాం: సీఎం జగన్
May 20, 2021, 3:10 pm IST
మొత్తం లక్షా 25వేల కోట్లు ప్రజలకు చేరవేశాం: సీఎం జగన్
May 20, 2021, 3:08 pm IST
కుట్రలతో గోడల రంగులను తుడిచేయగలిగారు.. కానీ, జనం గుండెల్లో మాత్రం అలాగే ఉన్నాయి: సీఎం జగన్
May 20, 2021, 3:07 pm IST
ఎన్నికలు ఏవైనా ప్రజలు ఒకే జెండాను గెలిపించారు: సీఎం జగన్
May 20, 2021, 3:06 pm IST
తప్పుడు వార్తలతో ఆడే గుండెలను ఆపొద్దు: సీఎం జగన్
May 20, 2021, 3:05 pm IST
కేంద్రం నుంచి వ్యాక్సిన్లు వస్తే రోజుకు 10 లక్షల వ్యాక్సిన్లైనా వేస్తాం: సీఎం జగన్
May 20, 2021, 3:04 pm IST
ఒక్కరోజులో 6 లక్షల వ్యాక్సిన్లు వేసి చూపించాం: సీఎం జగన్
May 20, 2021, 3:01 pm IST
కరోనాకు చెక్ పెట్టాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం: సీఎం జగన్
May 20, 2021, 3:01 pm IST
ఒడిశా నుంచి విమానాల ద్వారా ఆక్సిజన్ తెప్పిస్తున్నాం: సీఎం జగన్
May 20, 2021, 3:00 pm IST
ఫోన్ చేసిన 20 నిమిషాల్లోనే అంబులెన్స్‌లు వస్తున్నాయి: సీఎం జగన్
May 20, 2021, 3:00 pm IST
ప్రతి పీహెచ్‌సీకి 104 వాహనాలు వెళ్లేలా చూస్తున్నాం: సీఎం జగన్
May 20, 2021, 2:59 pm IST
గాలిని కొనే రోజూ వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు: సీఎం జగన్
May 20, 2021, 2:58 pm IST
త్వరలోనే టీచింగ్-నర్సింగ్ కాలేజీలను తీసుకొస్తాం: సీఎం వైఎస్ జగన్
May 20, 2021, 2:56 pm IST
ఆక్సిజన్ కొరత లేకుండా ఎంతైనా ఖర్చు చేస్తాం: సీఎం జగన్
May 20, 2021, 2:54 pm IST
ఆరోగ్యశ్రీ ప్రతీ పేదవాడికీ అందేలా చర్యలు తీసుకున్నాం: సీఎం జగన్
May 20, 2021, 2:53 pm IST
వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు పిలిచిన తొలి రాష్ట్రం ఏపీనే: సీఎం జగన్
READ MORE
10:52 PM, 19 May
రేపు ఏపీ బడ్జెట్ సమావేశాలు, బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న జగన్ ప్రభుత్వం
10:52 PM, 19 May
బడ్జెట్ సమావేశాలను బహిష్కరించిన టీడీపీ
10:52 PM, 19 May
ఒక్కరోజు బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమావేశాలను బాయ్‌కాట్ చేసిన టీడీపీ
7:17 AM, 20 May
బడ్జెట్‌కు ముందు ఉదయం ఎనిమిది గంటలకు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశంకానుంది. రాష్ట్ర బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. అనంతరం శాసనసభ సమావేశాల ప్రక్రియ ప్రారంభంకానుంది.
7:18 AM, 20 May
ఉదయం 9గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి వర్చువల్‌గా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నారు.
7:42 AM, 20 May
రాష్ట్ర వార్షిక బడ్జెట్ (2021-22)రూ.2.28 లక్షల కోట్ల నుంచి రూ.2.30 లక్షల కోట్ల వరకు ఉండవచ్చునని తెలుస్తోంది.
8:45 AM, 20 May
ఏపీ కేబినెట్ భేటీ... బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన మంత్రి మండలి
8:47 AM, 20 May
తొలిసారి జెండర్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం
8:48 AM, 20 May
కాసేపట్లో ఆన్‌లైన్ ద్వారా బడ్జెట్ ప్రసంగం చేయనున్న గవర్నర్ విశ్వభూషణ్
8:48 AM, 20 May
గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం అనంతరం ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర
9:04 AM, 20 May
ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు. ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్ బిశ్వభూషణ్
9:04 AM, 20 May
కోవిడ్‌తో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపిన గవర్నర్
9:05 AM, 20 May
దేశవ్యాప్తంగా కరోనా ఉధృతంగా ఉందన్న గవర్నర్
9:06 AM, 20 May
ఏపీలో 900 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంది. ఆ మొత్తాన్ని మా ప్రభుత్వం వినియోగిస్తోంది. అంతేకాదు కేంద్రం కూడా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేసింది: గవర్నర్ బిశ్వభూషణ్ సింగ్
9:07 AM, 20 May
ఆరోగ్యశ్రీకి ప్రైవేట్ హాస్పిటల్స్‌లో 50శాతం బెడ్లు కేటాయింపు: గవర్నర్
9:07 AM, 20 May
కోవిడ్‌తో మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంది
9:08 AM, 20 May
కరోనాతో మళ్లీ ఆర్థిక రంగం కుదేలైంది: గవర్నర్
9:08 AM, 20 May
విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ప్రభుత్వం ఇస్తోంది. అది ప్రభుత్వం అజెండా: గవర్నర్
9:09 AM, 20 May
గ్రామ సెక్రటేరియట్లు, వార్డు సెక్రటేరియట్లు వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి: గవర్నర్
9:10 AM, 20 May
జగనన్న విద్యాకానుక ద్వారా 41 లక్షల మంది విద్యార్థులకు కిట్లు అందజేసింది ప్రభుత్వం: గవర్నర్
9:11 AM, 20 May
జగనన్న గోరుముద్ద పథకం కింద 38 లక్షల మంది విద్యార్థులకు పోషకాహారం అందిస్తున్నాం: గవర్నర్
9:13 AM, 20 May
జగనన్న గోరుముద్ద పథకంకు రూ.1600 కోట్లు కేటాయింపు
9:14 AM, 20 May
44.5 లక్షల తల్లులకు జగనన్న అమ్మ ఒడి పథకం
9:14 AM, 20 May
రాష్ట్రంలో కంటిచూపుతో ఎవరూ బాధపడకూడదని వైయస్సార్ కంటి వెలుగు కార్యక్రమం తీసుకొచ్చింది ప్రభుత్వం
9:20 AM, 20 May
అర్హులైన వారందరికీ ఇళ్లు ఇచ్చాం: గవర్నర్
9:21 AM, 20 May
అంగన్వాడీల ద్వారా పిల్లలకు పౌష్టికాహారం
9:22 AM, 20 May
అమూల్‌తో ఒప్పందం ద్వారా పాడిరైతులకు అదనపు ఆదాయం
9:22 AM, 20 May
కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం: గవర్నర్
9:26 AM, 20 May
సాగునీటి ప్రాజెక్టులను త్వరతగతిన పూర్తిచేస్తాం: గవర్నర్
9:27 AM, 20 May
రైతులకు 9గంటలు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాం: గవర్నర్
Andhra Pradesh govt is all set to introduce the budget for the year 2021-22 amid the covid case. The main opposition party had given a call to boycott the sessions as the govt will be holding it for a single day