అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ కేబినెట్ వాయిదా - అమిత్ షా తో సీఎం జగన్ సమావేశం...!!

|
Google Oneindia TeluguNews

ఏపీ మంత్రివర్గ సమావేశం మరోసారి వాయిదా పడింది. సెప్టెంబర్ 1న జరగాల్సిన కేబినెట్ భేటీని వాయిదా వేస్తూ సీఎస్ సమీర్ శర్మ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 31న వినాయక చవితి.. సెప్టెంబర్ 1,2 తేదీల్లో ముఖ్యమంత్రి కడప .. ఇడుపుల పాయ పర్యటనతో సమావేశం వాయిదా వేసారు. సెప్టెంబర్ 3న కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశం లో సీఎం హాజరు కానున్నారు.

కొద్ది కాలం క్రితం దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశానికి తిరుపతి వేదిక అయింది. అప్పుడు ఏపీ ప్రభుత్వం ఆతిధ్య బాధ్యతలు తీసుకుంది. ఇక, ఇదే అంశం పైన ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. విభజన సమయం నుంచి ఏపీకి జరిగిన నష్టాలను మరోసారి సమావేశంలో ప్రస్తావించాలని నిర్ణయించారు. ఇక, సెప్టెంబర్ 1న సీఎం జగన్ కడపకు వెళ్లనున్నారు. అదే రోజు రాత్రికి ఇడుపుల పాయలో బస చేస్తారు. సెప్టెంబర్ 2న దివంగత సీఎం వైఎస్సార్ సమాధి వద్ద నివాళి అర్పిస్తారు.

AP Cabient pot poned wich to be held on 1st sepetember, the reason in here

ఆ తరువాత ఆయన తిరిగి విజయవాడ చేరుకుంటారు. ఇక, కేబినెట్ సమావేశంలో అనేక కీలక అంశాలకు ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. కానీ, మరసారి సమావేశం ఎప్పుడు నిర్వహించేదీ నిర్ణయం తీసుకోనున్నారు. సెప్టెంబర్ రెండో వారంలో ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటుగా ప్రభుత్వం ఉపాధ్యాయుల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు..మూడు రాజధానులకు సంబంధించిన అంశాల పైన కేబినెట్ లో చర్చించనున్నారు.

English summary
AP Cabinet post pooned due to CM Jagan busy schedule. Jagan to visit Kadapa tour and attend outhern Region council meet on Septemeber 3rd.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X