వాలంటీర్లపై ఇక ఇలా - జగన్ భూములపై కీలక నిర్ణయం..!!

ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలకు సిద్దమైంది. ఈ రోజు జరిగే సమావేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేయనుంది. వాలంటీర్ల వ్యవహారానికి ఈ సమావేశంలో ముగింపు పలికే ఛాన్స్ ఉంది. అదే విధంగా నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపైనా కేబినెట్‌ సమావేశంలో చర్చ జరగనుంది. జగన్ కు పల్నాడులో సిమెంట్ ఫ్యాక్టరీకి కేటాయించిన భూముల పైన పపన్ చేసే ప్రతిపాదన.. మంత్రివర్గం తీసుకొనే నిర్ణయం పైన ఆసక్తి కనిపిస్తోంది.

మంత్రివర్గ భేటీలో
ఏపీ మంత్రివర్గం ఈ రోజు సమావేశం కానుంది. పలు కీలక అంశాలు నేటి భేటీలో చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. అసెంబ్లీలో ప్రవేశ పెట్టి ఆమోదించే బిల్లులకు నేటి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్‌-1982 రిపీల్ బిల్లు పైన నేటి కేబినెట్ భేటీలో చర్చించి కొన్ని సవరణలు ప్రతిపాదించే అవకాశం కనిపిస్తోంది. భూ ఆక్రమణ దారుల విషయంలో కఠిన చట్టం తీసుకొచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత భూ ఆక్రమణల పైన పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి.

AP Cabinet likely to take decision over Reservations and Land Grabbing act

కీలక నిర్ణయాలు
ల్యాండ్ గ్రాబింగ్ చట్టం-1982ను రద్దు చేసి..ఆ స్థానంలో ల్యాండ్ గ్రాబింగ్ ప్రోహిబిషన్ బిల్లు-2024ను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక, గతంలో ఇచ్చిన హామీ మేరకు నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపైనా కేబినెట్‌ సమావేశంలో చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. అందులో భాగంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం రద్దు చేసి తాజా నిర్ణయం అమలుకు వీలుగా ప్రతిపాదనలు మంత్రివర్గం ముందుకు రానున్నాయి.ప్రభుత్వం ప్రాధాన్యతాంశాలుగా భావిస్తున్న విజన్‌-2047, కొత్త క్రీడా విధానం, డ్రోన్, సెమీకండక్టర్, డాటా సెంటర్ పాలసీలకు ఆమోద ముద్ర వేయనున్నారు.

వాలంటీర్ల పై చర్చ
ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంచే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అనకాపల్లి వద్ద ఆర్సెలార్ మిట్టల్ గ్రూప్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన భూ కేటాయింపులపై ఏపీ కేబినెట్‌లో చర్చించనున్నారు. పల్నాడు జిల్లాలోని సరస్వతి పవర్ భూములను పరిశీలించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అక్కడ మాజీ సీఎం జగన్ భూముల స్వాధీనం పైన నేటి మంత్రివర్గంలో ప్రస్తావించనున్నారు. వీటి పైన ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇక, వాలంటీర్ల కొనసాగింపు .. కుదింపు విది విధానాల పైన ఈ రోజు జరిగే మంత్రివర్గ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+